Badrinath | బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూసివేత
Badrinath | ప్రముఖ బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూతపడ్డాయి. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శీతాకాలం నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు ఆలయ
Badrinath Dham | ప్రముఖ బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూతపడ్డాయి. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శీతాకాలం నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు. రాబోయే ఆరు నెలల పాటు పాండుకేశ్వర్, జోషిమఠ్‌లో బద్రీనాథుడికి పూజలు జరుగనున్నాయి. ఆలయం మూసివేయనున్న సందర్భంగా సింహద్వారాన్ని బంతిపూలతో అలంకరించారు. గత ఐదు రోజులుగా ప్రత్యేక పూజలు జరుగుతుండగా.. శుక్రవారం లక్ష్మీదేవి ఆవాహన పూజలు చేసి, ‘కడాయి భోగ్’ నైవేద్యం సమర్పించారు.
శనివారం రావల్ ఈశ్వరీ ప్రసాద్ నంబూదరి బద్రీనాథ్ ధామ్ గర్భాలయంలో లక్ష్మీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఉద్ధవ్, కుబేర్ జీ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బద్రీనాథ్ – కేదార్నాథ్ ఆలయ కమిటీ ఇన్చార్జి డాక్టర్ హరీశ్ గౌర్ మాట్లాడుతూ ఘృత్ కంబల్ (నెయ్యిలో ముంచిన ఉన్ని దుప్పటి) బద్రీనాథుడికి సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ తర్వాత 3.35 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు తెలిపారు. ఏటా శీతాకాలం సందర్భంగా ఛార్‌ధామ్ ఆలయాలను మూసివేసే విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో మంచు విపరీతంగా కురుస్తుంటుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచువర్షం కురుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

