Supreme Court: కోర్టు అనుమతితో శిశువును చంపాలనుకుంటున్నారా: సీజేఐ చంద్రచూడ్
supreme court: అబార్షన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు అనుమతితో శిశువు చంపాలనుకుంటున్నారా అని ఓ కేసులో సీజే చంద్రచూడ్ ప్రశ్నించారు. 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఓ మహిళ అభ్యర్థన చేసింది. ఆ కేసులో రేపు తుది తీర్పు ఇవ్వనున్నారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ సీజే డీవై చంద్రచూడ్ ఓ కేసులో సీరియస్ అయ్యారు. 26 వారాల ప్రెగ్నెంట్ పెట్టుకున్న అభ్యర్థన కేసులో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ పెట్టుకున్న రిక్వెస్ట్‌పై స్పందిస్తూ.. కోర్టు ఆర్డర్ ద్వారా పర్మిషన్ తీసుకుని శిశువును చంపాలనుకుంటున్నారా అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఈ కేసులో శుక్రవారం మళ్లీ విచారణ చేపట్టనున్నారు.
అబార్షన్ అపీల్ గురించి ఆ మహిళతో కేంద్రం తరపున లాయర్ మాట్లాడాలని సుప్రీంకోర్టు సూచించింది. సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళా సుప్రీంలో పిటీషన్ వేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె ఇప్పటికే డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ఆ పిటీషన్లో పేర్కొన్నారు. మానసికంగా, ఆర్థికంగా మూడవ శిశువును పెంచే స్థితిలో తాను లేనట్లు ఆమె ఆ పిటీషన్లో తెలిపింది.
ఈ కేసులో అబార్షన్‌కు అనుమతి ఇస్తూ అక్టోబర్ 9వ తేదీన కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎయిమ్స్ వైద్యుల బృందం మాత్రం అబార్షన్‌కు నిరాకరించారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం బుధవారం ఈ కేసులో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో ఆ కేసును ఇవాళ సీజే చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం టేకప్ చేసింది. రేపు మళ్లీ తీర్పు ఇవ్వనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

