ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం.. గవర్నర్‌ను కలిసిన ఎంకే స్టాలిన్
DMK President MK Stalin: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఈ ఉదయం రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌ను కలిసి తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేల బలం ఉన్నదని, అవకాశం ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఈ మేరకు డీఎంకే శాసనసభాపక్షం చేసిన తీర్మానం ప్రతిని గవర్నర్‌కు అందజేశారు. ఈ విషయాన్ని డీఎంకే నేత ఆర్ఎస్ భారతి మీడియాకు వెల్లడించారు. ఈ ఉదయం గవర్నర్‌ను కలిసిన వారిలో పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, నేతలు టీఆర్ బాలు, దురై మురుగన్ తదితరులు ఉన్నారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

