DMK Manifesto | మహిళలకు రూ.5 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు.. యువతకు ఉపాధి భరోసా..!
DMK Manifesto : సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే ఓటర్లను ఆకర్షించే విధంగా ఆదివారం స్టాలిన్ పార్టీ మ్యానిఫెస్టో (DMK Manifesto) విడుదల చేశారు.
DMK Manifesto : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండో దఫా విజయం సాధించేందుకు సీఎం స్టాలిన్ సారథ్యంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ పావులు కదుపుతోంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే ఓటర్లను ఆకర్షించే విధంగా ఆదివారం స్టాలిన్ పార్టీ మ్యానిఫెస్టో (DMK Manifesto) విడుదల చేశారు. తమిళ ప్రజలు ద్రవిడియన్ మోడల్2.0 కోరుకుంటున్నారని పేర్కొన్న స్టాలిన్ కీలక వాగ్దానాల జాబితాను వెల్లడించారు. మహిళా ఓటర్లకు పలు తాయిలాలు ప్రకటించిన సీఎం.. బ్రేక్ఫాస్ట్ పథకాన్ని 8వ తరగతి విద్యార్ధులకు వర్తింపజేస్తామని, వృద్ధాప్య పింఛన్లు రూ.2 వేలకు పెంచుతామని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలను పునస్కరించుకొని డీఎంకే అధినేత స్టాలిన్ తమిళ ప్రజలపై వరాల జట్లు కురిపించారు. డీఎంకే సర్కార్ రెండు డిజిట్ల వృద్ధి సాధించిందని వెల్లడించిన ఆయన పార్టీ మ్యానిఫెస్టోలో మహిళా సంక్షేమం, యువతకు పెద్దపీట వేశారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు సంక్షేమ పథకాలు, నగదు బదలీ, ఆర్ధిక భరోసాకు ప్రాధాన్యమిచ్చారు. 1.37 కోట్ల మంది మహిళలకు ప్రతినెల అందిస్తున్న సాయాన్ని రూ.2 వేలకు పెంచుతామని సీఎం తెలిపారు.
DMK to release poll manifesto
The Dravidian model of governance is working really hard to make Tamil Nadu the number one state…: TN CM @mkstalin
(Translation by: @dharannniii) pic.twitter.com/KomEow2Ntw
— TIMES NOW (@TimesNow) March 29, 2026
‘ఇల్లాథరసు’ పథకం కింద ఇంటి వస్తువుల కొనుగోలుకు రూ.8 వేల కూపన్లు, చంటి పిల్లలను చూసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని స్టాలిన్ వెల్లడించారు. బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఎనిమిదో తరగతి విద్యార్థులకు వర్తింపజేస్తామని, వృద్ధాప్య పింఛన్లు రూ.2 వేలకు పెంచుతామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పనకు పవర్ లింక్డ్ పంపుసెట్లను ఉచితంగా అందిస్తామని, నియో టైడల్ పార్క్ ఏర్పాటు చేస్తామని స్టాలిన్ వెల్లడించారు. గత ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని, మరో అవకాశం ఇస్తే మరింతగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని ఈ సందర్భంగా ఓటర్లను సీఎం అభ్యర్థించారు. ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
TN Polls: DMK chief Stalin unveils poll manifesto, says govt made TN reach top in development.
TN polls: DMK manifesto promises expansion of CM breakfast scheme up to Class 8.
TN polls: Will increase women’s monthly grant to Rs 2,000, says DMK chief Stalin in Chennai.
Poll… pic.twitter.com/mjGF2X3BUJ
— Press Trust of India (@PTI_News) March 29, 2026
మ్యానిఫెస్టోలోని అంశాలు..
మహిళలకు ప్రతినెల సాయం రెండింతలు
వృద్ధాప్య పింఛను రూ.2 వేలకు పెంపు.
35 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ట్యాప్ల పంపిణీ.
మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు.
ఆరోగ్య బీమా పరిధి రూ.1 లక్షకు పెంపు. డయాలసిస్ సౌకర్యాల విసర్తణ.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

