మూల్యాంకనంపై భిన్నాభిప్రాయాలు

ప్రయోజనమని కొందరు.. అశాస్త్రీయమని మరికొందరు విద్యావేత్తల వాదన
న్యూఢిల్లీ : సీబీఎస్ఈ మూల్యాంకన విధానంపై విద్యావేత్తలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ విధానం నిష్పక్షపాతంగా ఉన్నదని కొందరు ఆహ్వానిస్తుండగా, శాస్త్రబద్ధంగాలేదని మరికొందరు విమర్శిస్తున్నారు. పది, పదకొండు తరగతుల్లో మెరుగ్గా మార్కులు సాధించిన 12వ తరగతి విద్యార్థులకు ఈ మూల్యాంకనం ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుందని రోహినీలోని ఎంఆర్జీ స్కూల్ డైరెక్టర్ రజత్ గోయల్ తెలిపారు.10వ తరగతి మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇవ్వడం మంచి నిర్ణయమని సేత్ ఆనంద్రామ్ జైపురియా ఎడ్యుకేషనల్ గ్రూప్ చైర్మన్ శిశిర్ జైపురియా అన్నారు. మరోవైపు, 12 ఫలితాలకు 10, 11 తరగతుల మార్కులను ప్రాతిపదికగా తీసుకోవడమేంటని హెరిటేజ్ స్కూల్స్ సీఈవో విష్ణు కార్తిక్ ప్రశ్నించారు. రెండు తరగతుల్లోని సబ్జెక్టులకు తేడాలు ఉన్నాయన్నారు. 10, 11వ తరగతిలో ప్రతిభ చూపని విద్యార్థి.. 12వ తరగతిలో పట్టుదలగా చదివినప్పటికీ, గడిచిన బోర్డు పరీక్షల మార్కులను తీసుకోవడం వల్ల ఆ విద్యార్థికి నష్టమేనని ఎఫ్ఐసీసీఐ ఎరైజ్ చైర్మన్ మనిత్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు.
హెరిటేజ్ స్కూల్స్ సీఈవో విష్ణు కార్తిక్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CBSE
- marks waitage
- valuation
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

