టాప్-5 రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం

అస్సాం సీఎంగా హిమంత ప్రమాణం
గువాహటి: అస్సాం 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గువాహటిలోని శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖి ఆయనతో ప్రమాణం చేయించారు. ఇటీవలే ముగిసిన అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారం చేపట్టగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వశర్మలలో ముఖ్యమంత్రి ఎవరవుతారనే ఉత్కంఠకు తెరదించుతూ ఆదివారం బీజేపీ అధిష్టానం హిమంత పేరును ఖరారుచేసింది. కాగా, సోమవారం సీఎం హిమంతతో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో 10 మంది బీజేపీ నుంచి ఉండగా, అసోం గణ పరిషత్ (ఏజీపీ) నుంచి ఇద్దరు, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) నుంచి ఒకరు ఉన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా, మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, రమేశ్వర్ తెలి, నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫ్యూ రియో పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం సందర్భంగా హిమంత మాట్లాడుతూ.. ఐదేండ్లలో భారత్‌లోని టాప్-5 రాష్ర్టాలలో అస్సాంను నిలుపుతానని అన్నారు. అందుకోసం తక్షణమే పని మొదలుపెడుతామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

