Dementia | మీకు మతిమరుపు ఉందా.. అయితే పగటిపూట ఓ కునుకు తీయండి..!
మధ్యాహ్నం వేళ ఓ కునుకు తీయటం కొంతమందికి అలవాటు! ఆఫీసుల్లోనూ మధ్యాహ్నం భోజ నం తర్వాత.. డెస్క్‌లపై నిద్రపోయేవాళ్లూ ఉంటారు.
Dementia | న్యూఢిల్లీ, జూలై 22: మధ్యాహ్నం వేళ ఓ కునుకు తీయటం కొంతమందికి అలవాటు! ఆఫీసుల్లోనూ మధ్యాహ్నం భోజనం తర్వాత.. డెస్క్‌లపై నిద్రపోయేవాళ్లూ ఉంటారు. అయితే ఇలా పగటిపూట నిద్రపోవటం.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అద్భుత ఫలితాలు వస్తాయంటూ ‘యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ’ ప్రొఫెసర్ మొహామద్ ఇమాస్రీ తన పుస్తకంలో పేర్కొన్నారు. పగటి నిద్రతో ‘డిమెన్షియా’ (మతిమరుపు) బారినపడే అవకాశం ఉండదన్న సంగతి సైన్స్ పరిశోధనలు కూడా చెబుతున్నాయని అన్నారు. జ్ఞాపకశక్తిని ‘రీరైట్’ చేస్తుందన్నారు.
ఆయన రాసిన ‘ఐమైండ్: ఆర్టిఫిషియల్, రియల్ ఇంటెలిజెన్స్’ పుస్తకం ప్రకారం, మెదడుకు సరైన పని లేకున్నా, కృత్రిమ మేథపై ఎక్కువగా ఆధారపడ్డా.. డిమెన్షియా బారనపడే ప్రమాదముందన్నారు. ప్రతి ఒక్కరూ తమ భౌతిక, శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని సూచించారు. మెదడుకు ఒక క్రమపద్ధతిలో పని చెప్పటం.. దాని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు.
మెదడు చురుగ్గా ఉండాలంటే దానికి కొంత విశ్రాంతి అవసరమని, అది నిద్ర ద్వారా లభిస్తుందని చెప్పారు. ‘మన మెదడు నిరంతరం పనిచేయలేదు. దానికి కొంత సమయం నిద్ర ద్వారా విశ్రాంతి ఇవ్వాలి. అందునా పగటి నిద్రతో మెదడు పునరుత్తేజం పొందుతుంది. శారీరక, మానసిక వికాసంతో ‘డిమెన్షియా’ బారినపడే రిస్క్‌ను తగ్గిస్తుంది’ అని ఇమాస్రీ వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

