ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు మరో కోల్డ్ స్పెల్ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది. మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా, సోమవారం ఉదయం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీంతో ప్రజలు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీలో నేటి నుంచి మరో ఆరురోజులపాటు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Delhi | ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు మరో కోల్డ్ స్పెల్ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది. మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా, సోమవారం ఉదయం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీంతో ప్రజలు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీలో నేటి నుంచి మరో ఆరురోజులపాటు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సోమవారం ఉదయం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల సెల్సియస్‌గా, లోధి రోడ్డులో 1.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. మరోవైపు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టంగా అలముకొన్న పొగమంచు కారణంగా 13 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. పలు విమానాలు సైతం ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు.
రానున్న ఐదు రోజుల్లో ఢిల్లీ సహా పంజాబ్, హర్యాణా, చండీగఢ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కాగా, ఈనెల 5 నుంచి 9వ తేదీల మధ్య ఏర్పడిన కోల్డ్ స్పెల్ కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో ఇంతటి తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి. ఐఎండీ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 15 రోజుల్లో 50 గంటలపాటు పొగమంచు కురిసింది. 2019 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో మంచు కురవడం ఇదే తొలిసారి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cold wave
- foggy weather
- IMD
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

