చావు దెబ్బతీసిన మే.. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో మరణమృదంగం

న్యూఢిల్లీ: మే నెలలో కోవిడ్ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నెలలో ఢిల్లీలో అత్యధిక స్థాయిలో మరణాలు సంభవించాయి. అక్కడ డెత్ రేటు 2.9 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది జాతీయ సగటు 1.3 శాతం కన్నా రెట్టింపు అని అధికారులు చెప్పారు. ఓ పత్రిక కథనం ప్రకారం.. పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ జాతీయ సగటు కన్నా రెట్టింపు సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో 2.8 శాతం, ఉత్తరాఖండ్‌లో 2.7 శాతంతో మరణాలు నమోద అయ్యాయి. కోవిడ్ మహమ్మారి పంజా విసిరిన తర్వాత.. ఇంత అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించింది మే నెలనే కావడం గమనార్హం.
ఢిల్లీలో మే నెలలో మొత్తం 2.8 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, దాంట్లో 8900 మంది మరణించారు. అంటే సీఎఫ్ఆర్ 2.92 శాతంగా ఉన్నట్లు గమనించారు. ఇక మహాకుంభ మేళా జరిగిన ఉత్తరాఖండ్‌లో వైరస్ వల్ల మే నెలలో నమోదు అయిన మరణాలు 59 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. మే నెలలో ప్రతి గంటకు కనీసం 165 మంది కోవిడ్‌తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు.
గత ఏడాది దేశవ్యాప్తంగా 1.48 లక్షల మంది కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే అంతే మంది మరణించినట్లు తెలుస్తోంది. మహమ్మారి మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఈ మే నెలలోనే 33 శాతం మరణాలు సంభవించాయి. మే నెలల ప్రతి రోజు సగటున 3400 మంది ప్రాణాలు విడిచారు. కనీసం 13 రోజుల పాటు ఆ సంఖ్య నాలుగు వేలు దాటింది. మే 19వ తేదీన అత్యధికంగా 4529 మంది వైరస్‌కు బలయ్యారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వల్ల 577 మంది పిల్లలు అనాథలయ్యారు. ఇండియాలో వ్యాక్సిన్ తీసుకునేందుకు 18 ఏళ్లు దాటిన వారి సంఖ్య 94 కోట్లుగా ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

