సీజేపీ నేతలు సౌరవ్, రాంకా విడుదల
జంతర్ మంతర్ వద్ద ఈనెల 14న నిరసన తెలిపిన తర్వాత నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విడుదల చేయాలని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్(ఎస్ఈఎం) బుధవారం ఆదేశించారు. తమ కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వారు ఉపసంహరించుకున్న కొన్ని గంటల్లో విడుదల ఉత్తర్వులు వెలువడ్డాయి.
- వారంపాటు తీహార్ జైల్లో ఉన్న నేతలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: జంతర్ మంతర్ వద్ద ఈనెల 14న నిరసన తెలిపిన తర్వాత నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విడుదల చేయాలని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్(ఎస్ఈఎం) బుధవారం ఆదేశించారు. తమ కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వారు ఉపసంహరించుకున్న కొన్ని గంటల్లో విడుదల ఉత్తర్వులు వెలువడ్డాయి.
అనంతరం బుధవారం రాత్రి వారు తీహార్ జైలు నుంచి విడుదల య్యారు. వారి కస్టడీ గడువు ముగియనున్న నేపథ్యంలో బుధవారం వారిద్దరినీ ఎస్ఈఎం ముందు హాజరుపరిచారు. నిరసన ప్రదేశంగా గుర్తింపును రద్దు చేసిన జంతర్ మంతర్‌లోకి ప్రవేశించడంతోపాటు శాంతి ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దాస్, రాంకాలను ఈనెల 14న ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈనెల 19న వారి కస్టడీ కాలాన్ని మరో రెండు రోజులు పొడిగించారు.
మీరు జెన్‌జీ కాదన్నమాట!
ఢిల్లీ హైకోర్టులో సోమవారం విచారణ సందర్భంగా సరదా సంభాషణ చోటుచేసుకుంది. విచారణ సందర్భంగా సౌరవ్, రాంకా తరఫున హాజరైన న్యాయవాది అభిక్ చిమ్నీని ఆ ఇద్దరు నేతల వయస్సు ఎంత అని జస్టిస్ ప్రసాద్ అడిగారు. దాస్ వయస్సు 27 ఏండ్లు, రాంకా వయస్సు 32 ఏండ్లు అని చిమ్నీ కోర్టుకు తెలిపారు. అయితే మీరు జెన్‌జీ కాదు. అసలు జెన్‌జీ అంటే ఏమిటి? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. సాధారణంగా 1997 తర్వాత జన్మించిన వారిని జెన్‌జీ అని పిలుస్తారని న్యాయవాది తెలియచేయగా అయితే మీరు జెన్‌జీ కాదు అని జస్టిస్ ప్రసాద్ పునరుద్ఘాటించారు.
ఫ్రాన్స్ అల్లర్లను ప్రస్తావించిన కోర్టు
సీజేపీ నేతలు సౌరవ్, రాంకా అరెస్టుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఫ్రాన్స్‌లో జరుగుతున్న విద్యార్థుల నిరసనలను ప్రస్తావించింది. విద్యార్థుల ఆందోళనలుగా ప్రారంభమైన నిరసనలు చివరకు నిప్పంటించడం, దోపిడీకి దారితీశాయని వ్యాఖ్యానించింది. నిరసనలకు పోలీసుల అనుమతి తీసుకోవడం కేవలం ఆందోళనకారులను అడ్డుకోవడానికి మాత్రమే కాదని, ఇతరులు చేరి పరిస్థితులను దిగజార్చకుండా నిరోధించడానికి కూడా అని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

