Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Delhi Police | ఆందోళనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) లను ఇప్పుడే ఉససంహరించవద్దని, కేంద్ర బలగాల మోహరింపును ఈ నెల 20 వరకు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు (Delhi Police) కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ (Union Home Ministry) కి లేఖ రాశారు.
Delhi Police : ఆందోళనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) లను ఇప్పుడే ఉససంహరించవద్దని, కేంద్ర బలగాల మోహరింపును ఈ నెల 20 వరకు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు (Delhi Police) కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ (Union Home Ministry) కి లేఖ రాశారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు.
ఆందోళనలు పెరిగే అవకాశం ఉందనే నిఘావర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటంతోపాటు ఉద్రిక్తతలకు తావులేకుండా ఉండేందుకే గడువు పెంచాలని కోరినట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం విధుల్లో ఉన్న 273 కంపెనీల బలగాల మోహరింపు గడువు సోమవారంతో ముగిసింది. మరోవైపు జంతర్‌మంతర్, ఎన్నికల సంఘం కార్యాలయం, పార్లమెంట్ హౌస్, ఇండియా గేట్ వంటి ప్రాంతాల్లో నిరసనలు మరింత తీవ్రమమ్యే అవకాశం ఉంది.
ఈ 273 సీఏపీఎఫ్ కంపెనీల మోహరింపును పొడిగించాలని పోలీసులు తమ లేఖలో పేర్కొన్నారు. నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మొత్తం 301 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలకు అనుమతి లభించింది. అక్టోబర్ 6న 221 కంపెనీలకు, 8న మరో 80 కంపెనీలకు ఆమోదం తెలపడంతో ఆ కంపెనీలు విధుల్లో పాల్గొన్నాయి. అదనంగా మంజూరైన 80 బలగాల్లో 28 సోమవారం నాటికి ఢిల్లీకి చేరుకోలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

