అనిల్ బైజల్ షాకింగ్ నిర్ణయం.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు పంపించారు. 2016 నుంచి అనిల్ బైజల్ ఢిల్లీ ఎల్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవిలో కొనసాగినంత కాలం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో ఆయన పొసిగేదే కాదు. చాలా సార్లు వారిద్దరి మధ్య పాలనా వ్యవహారాల్లో వివాదాలు తలెత్తాయి.
తమ పాలనలో ఎల్జీ ప్రతిసారీ జోక్యం చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పద్ధతి బాగో లేదని ఫైర్ అయ్యారు. చాలా విషయాల్లో వీరిద్దరి మధ్య పొసిగేది కాదు. కరోనా సమయంలోనూ వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.
వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేతపై…
వీకెండ్ కర్ఫ్యూను ఎత్తేయాలని సీఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకుంటే.. ఎల్జీ అనిల్ బైజల్ వ్యతిరేకించారు. కేసుల సంఖ్య తగ్గలేదని, వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేయడం కుదరదని వ్యతిరేకించారు.
రైతు ఉద్యమ సమయంలో…
ఇక రైతు ఉద్యమ సమయంలో పోలీసుల తరపున వాదనలను వినిపించేందుకు కేజ్రీవాల్ సర్కార్ ఓ లాయర్ల బృందాన్ని ఎంపిక చేసింది. ఈ ప్యానెల్‌ను ఎల్జీ బైజల్ వ్యతిరేకించారు. మరో ప్యానెల్‌ను సూచించారు.

పాలనలో సర్వాధికారాలు తనవేనంటూ…
ఇక మరో విషయంలోనూ సీఎం కేజ్రీవాల్, ఎల్జీ మధ్య వివాదం తలెత్తింది. ఢిల్లీ పాలనా వ్యవహారాల్లో సర్వాధికారాలు తనవేనంటూ, ఎల్జీ బైజల్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో… సీఎం కేజ్రీవాల్ ఏ నిర్ణయం తీసుకున్నా… ఎల్జీని సంప్రదించే నిర్ణయం తీసుకోవాల్సి వుండేది. అయితే.. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగానే ఎల్జీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కూడా వివాదానికి దారి తీసింది.

సీఎం కేజ్రీవాల్‌పై విచారణకు ఆదేశం…
ఇక… ఓ సారి అయితే సీఎం కేజ్రీవాల్‌పై విచారణ చేపట్టాలని ఎల్జీ బైజల్ ఏసీబీని ఆదేశించారు. కేజ్రీవాల్ తన బంధువుల కోసం 50 కోట్ల విలువైన భూదందాలను పరిష్కరించారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు. అంతేకాకుండా మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి కేజ్రీవాల్ 2 కోట్లు లంచం కూడా తీసుకున్నారని కపిల్ మిశ్రా ఆరోపించారు. దీనిపై ఎల్జీకి కపిల్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎల్జీ సీఎంపై విచారణ చేపట్టాలని ఏసీబీని ఆదేశించారు.
ఎవరీ అనిల్ బైజల్….
అనిల్ బైజల్ 1969 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అటల్ బిహారీ వాజ్పాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో బైజల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలోనే ఆయన కిరణ్ బేడీపై చర్యలు తీసుకున్నారు. జైళ్ల శాఖ నుంచి ఆమెను తప్పించి, సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ సెక్రెటరీగా కూడా పనిచేశారు. 2016 లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | పెద్ద నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

