Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్ఐఏ దర్యాప్తునకు ఎల్జీ సక్సేనా సిఫార్సు
Arvind Kejriwal | నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు నిధులు అందాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కేంద్రానికి సిఫార్సు చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం మరో బాంబు పేల్చారు. నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు నిధులు అందాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై (Arvind Kejriwal) జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. కేంద్ర హోం కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాశారు.
కాగా, ఉగ్రవాది దేవేంద్ర పాల్ భుల్లర్‌ను విడుదల చేయడానికి, దేశంలో ఖలిస్థానీ అనుకూల భావాలను ప్రోత్సహించడానికి వాంటెడ్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ పన్నూన్ స్థాపించిన నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు 16 మిలియన్ డాలర్లు అందాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆ లేఖలో ఆరోపించారు. దీని గురించి పన్నూన్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను ఆ లేఖకు జత చేశారు. ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఐఏతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మరోవైపు ఇప్పటికే మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్, తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

