Air Pollution: అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ.. 12 ఏళ్లు తగ్గనున్న స్థానికుల ఆయుష్షు
Air Pollution: ఢిల్లీలో పొల్యూషన్ పీక్ స్టేజ్‌లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఆ సిటీ నిలిచింది. ఇక ఆ నగరంలో నివసిస్తున్న వారి జీవిత కాలం 12 ఏళ్ల వరకు తగ్గుతున్నట్లు అంచనా వేశారు. ఢిల్లీ ప్రాంతంలో కాలుష్య సాంద్రత మూడు రెట్లు ఎక్కువగా ఉందని రిపోర్టులో తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత అధిక కాలుష్యం(Air Pollution) ఉన్న నగరంగా ఢిల్లీ నమోదు అయ్యింది. ఇక ఆ నగరంలో నివసిస్తున్న ప్రజల ఆయుష్షు 12 ఏళ్లు తగ్గిపోనున్నట్లు స్టడీ పేర్కొన్నది. చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్‌పై డేటాను రిలీజ్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సగటు ఆరోగ్య స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో కాలుష్యం ఉన్నట్లు తెలిపారు.
దేశంలో 67 శాతం మంది తీవ్ర కాలుష్య పరిస్థితుల్లోనే రోజులు గడుపుతున్నట్లు తెలిపారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ప్రాంతంలో పార్టికులేట్ పొల్యూషన్ డబ్ల్యూహెచ్‌వో సూచించిన స్థాయి కన్నా ఏడు రెట్లు ఎక్కువగా ఉంది. ఒకవేళ కాలుష్య తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగితే అప్పుడు జీవితకాలం 3.1 సంవత్సరాలు తగ్గనున్నదని రిపోర్టు తెలిపింది.
ఢిల్లీ ప్రాంతంలో మిగితా దేశంతో పోలిస్తే సాంద్రత మూడు రెట్లు ఎక్కువగా ఉందని రిపోర్టులో తెలిపారు. వాహనాలు, నిర్మాణాలు, వ్యవసాయం వల్ల కూడా కాలుష్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కాలుష్య వాయువులను పీల్చడం వల్ల బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్, చైనా, నైజీరియా, ఇండోనేషియా దేశాల ప్రజలు ఆరేళ్ల వరకు తమ జీవితకాలాన్ని కోల్పోనున్నట్లు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ala Venkateswar Reddy | కాంగ్రెస్ అసమర్థతతో ఎండిన పంటలు : మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్‌రెడ్డి
IPL: చెన్నై జట్టులోకి ఎస్ఆర్హెచ్ బ్యాటర్.. 7 కోట్లు వదులుకున్న లివింగ్‌స్టోన్
Anjaiah Yadav | ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. వీడియో
AP News | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30.50 శాతం పోలింగ్..!
TTD JEO | సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులది కీలక పాత్ర : టీటీడీ జేఈవో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

