Delhi High Court | ఇలాగే వదిలేస్తే బిలియన్ డాలర్ల వ్యాపారంగా మారొచ్చు..! సరోగసీపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Delhi High Court | భారత్‌లో సరోగసిని ప్రోత్సహించకూడదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీన్ని ఇలాగే వదిలేస్తే బిలియన్ డాలర్ల వ్యాపారంగా ఎదగవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సరోగసీ (రెగ్యులేషన్) చట్టాన్ని సవరిస్తూ కేంద్రం మార్చి 14న జారీ చేసిన నోటిఫికేషన్‌ను భారతీయ సంతతకి చెందిన కెనడా దంపతులు ఢిల్లీ కోర్టులో సవాల్ చేశారు.
Delhi High Court | భారత్‌లో సరోగసిని ప్రోత్సహించకూడదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీన్ని ఇలాగే వదిలేస్తే బిలియన్ డాలర్ల వ్యాపారంగా ఎదగవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సరోగసీ (రెగ్యులేషన్) చట్టాన్ని సవరిస్తూ కేంద్రం మార్చి 14న జారీ చేసిన నోటిఫికేషన్‌ను భారతీయ సంతతకి చెందిన కెనడా దంపతులు ఢిల్లీ కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకే సరోగసీ నిబంధనలను మార్చినట్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మినీ పుష్కరణ్ ధర్మాసనం తెలిపింది. ‘ఇందులో ఇప్పుడు కోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాలి. ఈ పరిశ్రమను (సరోగసీ)ని ప్రోత్సహించాల్సిర అవసరం లేదు. మీరు కెనడాలో ఉంటున్నారు. ఇక్కడ పరిశ్రమను నడుపలేరు. ఇది 2.3 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మారుతుంది.
మేం ఏదైనా చేయమని ప్రభుత్వాన్ని అడగాల్సిన సందర్భం ఇది కాదు’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. హిందూ ఆచారాల ప్రకారం చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వారు భారతీయ పౌరులని, దేశంలో శాశ్వత నివాసితులని పిటిషనర్లు తెలిపారు. తాము సంతానం లేని దంపతులమని, వారికి గర్భిణీ సరోగసీ ద్వారా తల్లిదండ్రులు కావాలని వారు కోరుకుంటున్నారని.. ఇందుకు సరోగసీ విధానం అవసరమవుతుందని పిటిషన్లు పేర్కొన్నారు. 2022 డిసెంబర్లో దంపతులకు డోనర్ ఓసైట్‌తో సరోగసీ కోసం మెడికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ మంజూరు చేయబడిందని.. వారు అధునాతన చికిత్సగా సరోగసీ విధానాన్ని చేయించుకోవచ్చని కోర్టు పేర్కొంది. అయితే, ఈ ఏడాది మార్చి 14న సరోగసీ నిబంధనలను సవరిస్తూ.. దాతల సరోగసీని నిషేధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

