మారిటల్ రేప్ నేరమే.. కాదు!
ఐపీసీ-375 సెక్షన్ కింద రేప్ నిర్వచనం నుంచి మారిటల్ రేప్‌ను( భార్యకు ఇష్టంలేని శృంగారం) మినహాయించడంలో రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో జడ్జీలు పరస్పరం భిన్నమైన తీర్పునిచ్చారు. మారిటల్ రేప్ కూడా లైంగిక దాడే అని
ఢిల్లీ హైకోర్డు డివిజన్ బెంచ్ భిన్నమైన తీర్పు
సుప్రీంకోర్టుకు వెళ్లాలని పిటిషనర్లకు సూచన
న్యూఢిల్లీ, మే 11: ఐపీసీ-375 సెక్షన్ కింద రేప్ నిర్వచనం నుంచి మారిటల్ రేప్‌ను( భార్యకు ఇష్టంలేని శృంగారం) మినహాయించడంలో రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో జడ్జీలు పరస్పరం భిన్నమైన తీర్పునిచ్చారు. మారిటల్ రేప్ కూడా లైంగిక దాడే అని, శిక్షార్హమైనదేనని ఒక జడ్జి తీర్పునివ్వగా, మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించకపోవడం రాజ్యాంగ విరుద్ధమైనదేమీ కాదని మరో జడ్జి తీర్పునిచ్చారు. ఈ అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఇద్దరు న్యాయమూర్తులు పిటిషనర్లకు సూచించారు.
డివిజన్ బెంచ్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ రాజీవ్ షక్దేర్.. ‘మారిటల్ రేప్‌కు ఉన్న మినహాయింపును తొలగించాలి. ఇది శిక్షార్హమైనది. స్వేచ్ఛ, జీవించే హక్కును ఇది హరిస్తున్నది’ అని తీర్పునిచ్చారు. దీనికి భిన్నంగా మరో జడ్జి జస్టిస్ హరిశంకర్ ‘మారిటల్ రేప్‌కు మినహాయింపు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమైనదేమీ కాదు’ అని పేర్కొన్నారు. ‘మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించలేం. అలా చేస్తే వివాహ వ్యవస్థ అస్థిరత్వానికి లోనవుతుంది’ అని కేంద్రం 2017లో ఢిల్లీ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- High court
- Marital Rape
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

