Sonam Wangchuk | వాంగ్చుక్కు అవసరమైన వైద్యసాయం అందించండి.. కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు
Sonam Wangchuk | పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) నిరాహార దీక్ష 19వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే ఆయనకు వైద్య సాయం అందించాలని సూచించింది.
Sonam Wangchuk : పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) నిరాహార దీక్ష 19వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే ఆయనకు వైద్య సాయం అందించాలని సూచించింది. ప్రతి ప్రాణం విలువైందేనన్న న్యాయస్థానం.. సొలిసిటర్ జనరల్ (Soliciter General) ను ఆయన ఆరోగ్యం గురించి ప్రశ్నించింది.
రోజుల తరబడి ఆహారం తీసుకోకపోవడంతో వాంగ్‌చుక్ ఆరోగ్యం విషమిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆయన శరీర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28 నుంచి సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆయన ఈ దీక్ష చేస్తున్నారు.
గడిచిన 18 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. దాంతో ఆయన దీక్ష విరమించాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు. సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష 19వ రోజుకు చేరడం, ఆయన ఆరోగ్యం దెబ్బతింటున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది. ప్రతి ప్రాణం విలువైందేనన్న న్యాయస్థానం.. అవసరమైతే ఆయన్ను కాపాడటానికి వైద్య సాయం అందించాలని కేంద్రంతోపాటు ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

