show cause notice | ఐఏఎస్ అధికారి ఆశిష్ మోర్‌కు ఢిల్లీ ప్రభుత్వం షోకాజ్ నోటీసు.. పరారీలో ఉన్నట్లు ఆరోపణ
show cause notice | బదిలీ ఉత్తర్వును ఉల్లంఘించిన సర్వీసెస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ఆశిష్ మోర్‌కు ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 13న షోకాజ్ నోటీస్ ( show cause notice) జారీ చేసింది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు ఆరోపించింది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులను తన నియంత్రణలోకి తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో బదిలీ ఉత్తర్వును ఉల్లంఘించిన సర్వీసెస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ఆశిష్ మోర్‌కు ఈ నెల 13న షోకాజ్ నోటీస్ ( show cause notice) జారీ చేసింది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు ఆరోపించింది. ఆశిష్ మోర్‌ను బదిలీ చేయడంతో ఆ పోస్ట్‌ను మరో అధికారికి అప్పగించకపోవడంపై సేవల విభాగం మంత్రి సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు. ఆయనకు జారీ చేసిన షోకాజ్ నోటీస్‌పై 24 గంటల్లో సమాధానం ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐఏఎస్ అధికారి ఆశిష్ మోర్‌ను ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదని మంత్రి భరద్వాజ్ తెలిపారు. సెలవు నోటీస్ ఇవ్వకుండా ఎవరికీ అందుబాటులో లేని ఆయన పరారీలో ఉన్నారని ఆరోపించారు.
మరోవైపు ఢిల్లీలో పరిపాలనపై లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య నెలకొన్న వివాదానికి సుప్రీంకోర్టు గత వారం తెరదించింది. పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్ తప్పించి మిగతా అన్ని శాఖలపై అధికారం, నియంత్రణ, శాసనాధికారం ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం గత గరువారం కీలక తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సేవల కార్యదర్శి ఆశిష్ మోర్‌ను ఢిల్లీ ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఆయన ఆ పోస్ట్ నుంచి తొలగకపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం గత శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అధికారుల బదిలీలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నదని, కోర్టు తీర్పును ధిక్కరించిందని ఆరోపించింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

