భార్యతో బలవంతపు శృంగారం నేరమా..? ఢిల్లీ హైకోర్టు భిన్న తీర్పు
న్యూఢిల్లీ: భార్యతో బలవంతపు శృంగారం చేయడం నేరమా? అలా రేప్ చేస్తే శిక్ష వేస్తారా? ఈ కేసులో ఇవాళ ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అంశంలో విరుద్ధ అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. భార్యాభర్తల మధ్య రేప్ జరిగితే దాన్ని నేరంగా పరిగణించాలా లేదా అన్న అంశంలో ఇద్దరు జడ్జిలు విభిన్న వాదనలు వినిపించారు. భార్యను రేప్ చేస్తే అది నేరమే అవుతుందని జస్టిస్ రాజీవ్ శక్దేర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఇదే అంశంలో జస్టిస్ హరి శంకర్ భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెక్షన్ 375 ప్రకారం అది రాజ్యాంగ ఉల్లంఘన కాదు అని ఆయన అన్నారు.
భార్య అనుమతి లేకుండా ఆమెతో లైంగిక సంబంధాన్ని కొనసాగించడం చట్టరీత్యా నేరమే అవుతుందని జస్టిస్ రాజీవ్ తన తీర్పులో ఆదేశించారు. అయితే ఈ అభిప్రాయాన్ని జస్టిస్ హరిశంకర్ తన తీర్పులో వ్యతిరేకించారు. మారిటల్ రేప్ అంశంలో ఇద్దరి జడ్జిల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఒకవేళ భార్య మైనర్ కాకపోతే, ఆమెతో జరిగే శృంగారం రేప్ కాదు అని చట్టం స్పష్టం చేస్తోంది. ఈ అంశంలో గతంలో పలుమార్లు ఢిల్లీ కోర్టు వాదనలు జరిపింది. ఆ తర్వాత ఈ కేసులో ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా కోర్టు కోరింది. అయితే జనవరి 21వ తేదీన తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం ఇవాళ దాన్ని వెల్లడించింది. తీర్పులో ఏకాభిప్రాయం లేకపోవడంతో.. ఈ కేసును సుప్రీం కోర్టుకు ట్రాన్సఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

