Arvind Kejriwal | సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
మద్యం పాలసీ కేసులో బెయిల్ అంశంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు.
Arvind Kejriwal | న్యూఢిల్లీ, జూన్ 23: మద్యం పాలసీ కేసులో బెయిల్ అంశంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై తాత్కాలిక స్టే విధించి, తీర్పు రిజర్వ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీసుకొన్న నిర్ణయం కొంత అసాధారణంగానే కనిపిస్తున్నదని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం సోమవారం అభిప్రాయపడింది.
అయితే ఈడీ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాతే.. కేజ్రీవాల్ అప్పీల్‌పై తాము నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నది. కేజ్రీవాల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. కాగా, కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈడీ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించనున్నది.
ఇవికూడా చదవండి..
గోధుమ నిల్వలపై కేంద్రం ఆంక్షలు
న్యూఢిల్లీ: దేశంలో గోధుమలు ధరలు పెరగకుండా వాటి నిల్వలపై కేంద్రం ఆంక్షలు విధించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు.
కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధల ప్రకారం రిటైల్ ఔట్లెట్లు, పెద్ద చైన్ రిటైలర్లుకు చెందిన వ్యక్తిగత స్టోర్లలో 10 టన్నుల వరకు గోధుమలను నిల్వ చేసుకోవచ్చు. ట్రేడర్లు, హోల్‌సేలర్లు, పెద్ద చైన్ రిటైలర్ల డిపోలలో మూడు వేల టన్నులు, ప్రాసెసర్లు తమ నెలవారీ నిల్వ సామర్ధ్యంలో 70 శాతం స్టాక్‌గా ఉంచుకోవచ్చు.
తీస్తాపై తగాదా.. సంప్రదించకపోవడంపై మమత ఫైర్
కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీస్తా జలాల పంపిణీ, ఫరక్కా ఒప్పందం గురించి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో జరిపిన చర్చలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా బంగ్లాదేశ్‌తో ఇటువంటి చర్చలు జరపడాన్ని ఆక్షేపించారు. సోమవారం ఈ మేరకు మోదీకి లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా చర్చలు జరపడం వాంఛనీయం కాదని, ఆమోదించదగినది కాదని స్పష్టం చేశారు. నీరు చాలా విలువైనదని, ప్రజల జీవనాధారమని తెలిపారు. ఇటువంటి సున్నితమైన విషయాల్లో తాము రాజీ పడబోమన్నారు. తీస్తా, ఫరక్కా జల ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

