తీహార్ జైలులో లొంగిపోయిన కేజ్రీవాల్
తన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైలులో లొంగిపోయారు.
- 21 రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృథా చేయలేదు
- దేశాన్ని రక్షించడం కోసం ప్రచారం చేశా: ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ, జూన్ 2: తన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైలులో లొంగిపోయారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి అనుమతినిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు.
బెయిల్ గడువు జూన్ 2కు ముగియడంతో ఆయన తీహార్ జైలుకు వచ్చారు. లొంగిపోవడానకి ముందు ఆయన గాంధీ స్మతివనం రాజ్‌ఘాట్‌లో నివాళి అర్పించారు. కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ దేవాలయంలో ప్రార్థనలు చేశారు. ‘నేను జైలుకు తిరిగి వెళ్తున్నాను.. అయితే అది అవినితి చేసినందుకు కాదు.. నియంతృత్వంపై గళం ఎత్తినందుకు’ అని అన్నారు.
‘సుప్రీం కోర్టు నాకు 21 రోజులు బెయిల్ ఇచ్చింది. నిజంగా అవి మరచిపోలేని రోజులు. ఒక్క నిమిషం కూడా వాటిని వృథా చేయలేదు. దేశాన్ని రక్షించడం కోసం ప్రచారం నిర్వహించా. ఆప్ నాకు ముఖ్యం కాదు, నా మొదటి ప్రాధాన్యత దేశానికే, తర్వాతే ఆప్’ అని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, ఆప్ నేతలు ఆయన వెంట వచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

