needle in boy’s lung | సూది మింగిన బాలుడు.. లంగ్‌లో చిక్కుకోగా అయస్కాంతం ద్వారా బయటకు తీసిన వైద్యులు
needle in boy’s lung | ఒక బాలుడు ప్రమాదవశాత్తు సూదిని మింగాడు. ఆ సూది ఊపిరితిత్తుల్లోకి వెళ్లి చిక్కుకుంది. (needle in boy’s lung) తీవ్ర దగ్గు, రక్తస్రావంతో అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆ బాలుడ్ని డాక్టర్లు కాపాడారు. లంగ్లోకి దిగిన నిడిల్ను అయస్కాంతం సహాయంతో బయటకు తీశారు.
న్యూఢిల్లీ: ఒక బాలుడు ప్రమాదవశాత్తు సూదిని మింగాడు. ఆ సూది ఊపిరితిత్తుల్లోకి వెళ్లి చిక్కుకుంది. (needle in boy’s lung) తీవ్ర దగ్గు, రక్తస్రావంతో అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆ బాలుడ్ని డాక్టర్లు కాపాడారు. లంగ్లోకి దిగిన నిడిల్ను అయస్కాంతం సహాయంతో బయటకు తీశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 1న ఏడేళ్ల బాలుడు పొరపాటున కట్టుమిషన్ సూదిని మింగాడు. పెద్దగా దగ్గడంతోపాటు నోటి నుంచి రక్తం కారుతున్న ఆ బాలుడ్ని అత్యవసరంగా ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.
కాగా, పరిశీలించిన డాక్టర్లు నాలుగు సెంటీమీటర్ల పొడవున్న నిడిల్ బాలుడి గొంతు నుంచి ఎడమ ఊపిరితిత్తులోకి వెళ్లినట్లు గుర్తించారు. లంగ్లోకి దిగిన ఆ సూది అక్కడ చిక్కుకున్నట్లు ఎక్స్‌రే ద్వారా తెలుసుకున్నారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ విశేష్ జైన్, డాక్టర్ దేవేంద్ర కుమార్ కలిసి ఆ సూదిని ఎలా బయటకు తీయాలి అని దానిపై ఆలోచించారు. డాక్టర్ జైన్ వెంటనే చాందినీ చౌక్ మార్కెట్లోని ఒక వ్యక్తిని సంప్రదించారు. 4 మిల్లీమీటర్ల వెడల్పు, 1.5 మిల్లీమీటర్ల మందం ఉన్న అయస్కాంతాన్ని తెప్పించారు. క్లిష్టమైన ఎండోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ఆ మ్యాగ్నెట్ సహాయంతో లంగ్లోకి దిగిన నిడిల్ను అతి సూనాయసంగా బయటకు తీశారు. వినూత్న పద్ధతిలో సర్జరీ నిర్వహించిన డాక్టర్లు ఆ బాలుడి ప్రాణాలు కాపాడారు.

Needle Struck In Lung
మరోవైపు బాలుడి ఊపిరితిత్తులోకి దిగిన సూదిని సాధారణ శస్త్రచికిత్స ద్వారా బయటకు తీయడం చాలా కష్టమని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. ఒకవేళ మ్యాగ్నెట్ ఫోర్స్‌కు ఆ నిడిల్ స్పందించి రాకపోతే తీవ్ర శ్రమతో కూడిన సంప్రదాయ శస్త్రచికిత్స చేయాల్సి ఉండేదని చెప్పారు. కడుపుతోపాటు, ఊపిరితిత్తిని ఓపెన్ చేయాల్సి ఉండేదని దీంతో ఆపరేషన్ ప్రక్రియ మరింత కష్టంగా మారేదని డాక్టర్ జైన్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Boy
- Delhi AIIMS
- doctors
- Lung
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

