Vijay Diwas | విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు నివాళులు
Vijay Diwas | నేడు విజయ్ దివస్. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ (PM Modi), రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) సహా తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.
Vijay Diwas | నేడు విజయ్ దివస్. దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు. 1971 యుద్ధం (1971 War) లో భారత్ పాకిస్థాన్ (Pakistan) పై విజయం సాధించింది. సరిగ్గా 53 ఏళ్ల క్రితం పాకిస్థాన్ నడ్డివిరిచి పాక్ నుంచి బంగ్లాదేశ్ (Bangladesh)కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. 1971లో తూర్పు పాకిస్థాన్‌లో మొదలైన స్వాతంత్య్ర పోరు భారత్-పాక్ మధ్య యుద్ధానికి దారి తీసింది. భారత సైన్యం పాక్‌ను ఓడించి, బంగ్లాదేశ్ అవతరణకు కారణమైంది. ఆ విజయానికి గుర్తుగా భారత్ ఏటా డిసెంబర్ 16న ‘విజయ్ దివస్’ (Vijay Diwas)ను నిర్వహిస్తుంది.
#WATCH | Delhi: Defence Minister Rajnath Singh lays wreath at the National War Memorial, on the occasion of #VijayDiwas
Vijay Diwas is celebrated every year across the country on December 16 to commemorate the victory of the Indian armed forces in the Indo-Pakistan war of 1971. pic.twitter.com/emqDcCNeRf
— ANI (@ANI) December 16, 2024
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ (PM Modi), రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) సహా తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ (National War Memorial) వద్ద రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాటి జ్ఞపకాలను గుర్తు చేసుకుంటూ నేతలు ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు.
నేడు విజయ్ దివస్. 1971 యుద్ధంలో అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించి, భారతదేశానికి విజయాన్ని అందించిన మన వీర జవాన్లకు నివాళులర్పిస్తున్నాను. ఈ యుద్ధంలో ప్రాణ త్యాగం చేసిన జవాన్ల కథలు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిస్తాయి : రాష్ట్రపతి ముర్ము
On Vijay Diwas, I pay homage to our valiant soldiers who displayed indomitable courage during the 1971 war, securing victory for India. A grateful nation remembers the ultimate sacrifice of our bravehearts whose stories inspire every Indian and shall remain a source of national…
— President of India (@rashtrapatibhvn) December 16, 2024
1971లో భారతదేశ చారిత్రాత్మక విజయానికి దోహదపడిన వీర సైనికుల ధైర్యాన్ని, వారి త్యాగాలను మేము ఎప్పటికీ గౌరవిస్తాము. వారి నిస్వార్థ అంకితభావం, అచంచలమైన సంకల్పం మన దేశాన్ని రక్షించాయి. మనకు కీర్తిని తెచ్చాయి. వారి త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి : ప్రధాని మోదీ
Today, on Vijay Diwas, we honour the courage and sacrifices of the brave soldiers who contributed to India’s historic victory in 1971. Their selfless dedication and unwavering resolve safeguarded our nation and brought glory to us. This day is a tribute to their extraordinary…
— Narendra Modi (@narendramodi) December 16, 2024
ఈ రోజు విజయ్ దివస్. సాయుధ బలగాల ధైర్యసాహసాలు, త్యాగాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తుంది. జవాన్ల త్యాగం, సేవను దేశం ఎన్నటికీ మర్చిపోదు : రాజ్‌నాథ్ సింగ్
Today, on the special occasion of Vijay Diwas, the nation salutes the bravery and sacrifice of India’s armed forces. Their unwavering courage and patriotism ensured that our country remained safe. India will never forget their sacrifice and service.
— Rajnath Singh (@rajnathsingh) December 16, 2024
Also Read..
Hydrogen | భూ అంతర్భాగంలో.. వెయ్యేండ్ల విద్యుత్తుకు సరిపడా హైడ్రోజన్ నిల్వలు!
Surat | షాకింగ్.. పని ఒత్తిడితో వేళ్లు నరికేసుకున్న ఉద్యోగి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

