Union Budget 2024-25 | హరియాణను విస్మరించిన బడ్జెట్..కమలం గుర్తును ప్రజలు విస్మరిస్తారు : దీపీందర్ హుడా
UnionBudget 2024 : నిర్మలమ్మ బడ్జెట్‌పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ బడ్జెట్ దశాదిశా లేదని, కేవలం బిహార్, ఏపీలకు కొంత సాయం మినహా దేశ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని విరుచుకుపడ్డాయి.
UnionBudget 2024 : నిర్మలమ్మ బడ్జెట్‌పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ బడ్జెట్ దశాదిశా లేదని, కేవలం బిహార్, ఏపీలకు కొంత సాయం మినహా దేశ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని విరుచుకుపడ్డాయి. దీర్ఘకాల వృద్ధి, తక్షణావసరాల మధ్య సమతూకం పాటించలేదని దుయ్యబట్టాయి. ధరల మంటతో సతమతమవుతున్న సామాన్యుడికి ఎలాంటి ఊరట లేదని, మహిళలు, యువతకు మొండిచేయి చూపారని పెదవివిరిచాయి.
పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని కాంగ్రెస్ నేత దీపీందర్ సింగ్ హుడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో రైతుల కోసం ఏమీ లేదని, కేవలం ఏపీ, బిహార్ గురించి మాత్రమే బడ్జెట్లో ప్రస్తావించారని పేర్కొన్నారు. హరియాణాను పూర్తిగా విస్మరించారని, హరియాణ ప్రజలు బీజేపీ కమలం గుర్తును కూడా గుర్తుంచుకోరని మండిపడ్డారు.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (Union Budget 2025) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Read More :
Mudra loans: ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

