Supriya Sule | అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోదరీమణులపై ప్రేమ పొంగిపొర్లుతోంది.. అజిత్ పవార్‌పై సుప్రియా ఫైర్
Supriya Sule | మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే తన సోదరుడు వరుసైన డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రియమైన సోదరీమణులను గుర్తుంచుకోలేదని అన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారి ప్రేమ పొంగిపొర్లుతోందని మండిపడ్డారు.
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) తన సోదరుడు వరుసైన డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రియమైన సోదరీమణులను గుర్తుంచుకోలేదని అన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారి ప్రేమ పొంగిపొర్లుతోందని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భార్య సునేత్ర పవార్‌ను సోదరి (సుప్రియా సూలే) పై పోటీకి దించడం పొరపాటని, దీనికి తాను చింతిస్తున్నట్లు ఇటీవల పేర్కొన్న అజిత్ పవార్‌కు ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు. అలాగే వ్యక్తిగత సంబంధాలు, వ్యాపారాన్ని ఆయన మిళితం చేశారని ఆరోపించారు. ‘సంబంధాలు, వ్యాపారం మధ్య తేడాను మన సోదరులు గుర్తించలేరు. ఎవరూ కూడా డబ్బును సంబంధాల్లోకి తీసుకురాకూడదు. అలాగే వ్యాపారంలోకి సంబంధాన్ని తీసుకురాకూడదు. అయితే మా సోదరుడు దీనిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఇది మాకు చాలా బాధ కలిగించింది’ అని అన్నారు.
కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘లడకీ బహీన్’ స్కీమ్‌ను సుప్రియా సూలే విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి వల్లనే మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే ప్రభుత్వం ఇవన్నీ చేస్తోంది. వారు నిజమైన ఉద్దేశంతో ఏమీ చేయరు. రెండేళ్ల క్రితం అక్కాచెల్లెళ్లపై ఎవరికీ ఆప్యాయత, ఆదరణ కనిపించలేదు. ఇది లోక్‌సభ ఎన్నికల ప్రభావం మాత్రమే’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

