Dawood Ibrahim | ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు తమ పేర్లను మార్చుకుంటూ ఉంటారు. ఓ తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న అనుమానితుల గురించి దర్యాప్తు అధికారులు పరిశోధన చేస్తున్న సమయంలో మారుపేర్లు తలనొప్పిగా మారుతుంటాయి. ఒకటి కంటే పేర్లు పెట్టుకొని దర్యాప్తు సంస్థల అధికారుల కళ్లలో మట్టి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు దర్యాప్తు, భద్రతా అధికారుల నుంచి తప్పించుకునేందుకు తమ పేర్లను మార్చుకున్నారు. ఉగ్రవాదులు ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. ఉగ్రవాదులకు ఒక్కటే రెండో కాదు ఏకంగా.. పది, పదిహేను పేర్లు సైతం ఉన్నాయి. అయితే, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన జాబితాలో హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీంతో సహా 31 మంది ఉగ్రవాదులకు మారుపేర్లున్నాయి. ఈ జాబితాలో హఫీజ్ సయీద్‌కు తొమ్మిది పేర్లు ఉండగా.. దావూద్ ఇబ్రహీంకు దాదాపు అత్యధికంగా 22 పేర్లున్నాయి.
ముంబై దాడుల నిందితుడు, భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం పేరు మరోసారి చర్చ జరుగుతున్నది. పాక్‌లో అతనిపై విష ప్రయోగం జరిగిందని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో పాక్‌లో అకస్మాత్తుగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే, దీనిపై పాక్ అధికారికంగా స్పందించలేదు. అయితే, దావూద్ అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ఎక్కువగా ఇక్బాల్ సేథ్, బడా పటేల్, అజీజ్ దిలీప్ తదితర పేర్లున్నాయి. ఉగ్రవాదులు తమ పేర్లను మార్చడం ద్వారా భద్రతా దళాలు, దర్యాప్తు సంస్థల కళ్లలో దుమ్ము కొట్టి పారిపోతుంటారు.
మౌలానా మసూద్ అజార్. ఈ ఉగ్రవాది మరో పేరు మౌలానా మహమూద్ మసూద్ అజార్ అల్వీ, విల్లా ఆడమ్ ఇస్సా. 26/11 ముంబై దాడుల సూత్రధారి ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ మహ్మద్ సయీద్‌కు తొమ్మిది పేర్లు ఉన్నాయి. హఫీజ్ సయీద్‌ను హఫీజ్ మొహమ్మద్ సాహిబ్, హఫీజ్ మొహమ్మద్ అనే పేర్లున్నాయి. సయ్యద్, హఫీజ్ మొహమ్మద్, మొహమ్మద్ సయీద్ పేర్లు పెట్టుకున్నాడు. ఈ జాబితాలో మూడోస్థానంలో జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ ఉండగా.. అతనికి అబూ వాహిద్ ఇర్షాద్ అహ్మద్ అర్షద్, కాకీ ఉర్ రెహ్మాన్, జకీర్ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, జకీర్ రెహ్మాన్ మారుపేర్లతో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు.
దావూద్ ఇబ్రహీంకు అత్యధికంగా మారుపేర్లున్నాయి. దావూద్ ఇబ్రహీం కస్కర్, దావూద్ హసన్ షేక్ కస్కర్, దావూద్ భాయ్, దావూద్ శబరి, ఇక్బాల్ సేథ్, బడా పటేల్, దావూద్ ఇబ్రహీం, షేక్ దావూద్ హసన్, అబ్దుల్ హమీద్ అబ్దుల్ అజీజ్, అనీస్ ఇబ్రహీం, అజీజ్ దిలీప్, దావూద్ హసన్ షేక్ ఇబ్రహీం కస్కర్ పేర్లున్నాయి. దావూద్ ఇబ్రహీం మీనన్, కస్కర్ దావూద్ హసన్, షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ రెహ్మాన్, దావూద్ హసన్ షేక్ ఇబ్రహీం, దావూద్ భాయ్, ఇబ్రహీం షేక్ మొహమ్మద్, అనీస్, షేక్ ఇస్మాయిల్ అబ్దుల్, షేక్ ఫారూఖీ, ఇక్బాల్ భాయ్ మారుపేర్లను వినియోగించాడు.
ఉగ్రవాది రియాజ్ ఇస్మాయిల్ షహబందర్ తన పేరును షా రియాజ్ అహ్మద్, రియాజ్ భత్కల్, మహ్మద్ రియాజ్, అహ్మద్ భాయ్, రసూల్ ఖాన్, రోషన్ ఖాన్, అజీజ్ పేర్లను పెట్టుకున్నాడు. ఇబ్రహీం మీనన్ తన పేరును టైగర్ మీనన్, ముస్తాక్, సికందర్, ఇబ్రహీం అబ్దుల్ రజాక్ మీనన్, ముస్తఫా, ఇస్మాయిల్‌గా మార్చుకొని తిరిగాడు. సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ షా సయ్యద్ సలావుద్దీన్, పీర్ సాహెబ్, ఎల్డర్‌గా పేరు పెట్టుకోగా.. అబ్దుల్ రవూఫ్ అస్గర్‌ను ముఫ్తీ, ముఫ్తీ అస్గర్, సాద్ బాబా, మౌలానా ముఫ్తీ రవూఫ్ అస్గర్ మార్చుకున్నాడు. ఇబ్రహీం అథర్ను అహ్మద్ అలీ, మహమ్మద్ అలీ షేక్, జావేద్ అమ్జాద్ సిద్ధిఖీ పేర్లున్నాయి.