Dancers kidnap groom | పెళ్లి బృందంపై దాడి చేసి.. వరుడ్ని కిడ్నాప్ చేసిన డ్యాన్సర్లు
Dancers kidnap groom | వివాహ వేడుకలో డ్యాన్స్ చేసే బృందం పెళ్లి కుటుంబాలపై దాడి చేశారు. అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. చివరకు పెళ్లి మండపం నుంచి వరుడ్ని కిడ్నాప్ చేశారు.
పాట్నా: వివాహ వేడుకలో డ్యాన్స్ చేసే బృందం పెళ్లి కుటుంబాలపై దాడి చేశారు. అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. చివరకు పెళ్లి మండపం నుంచి వరుడ్ని కిడ్నాప్ చేశారు. (Dancers kidnap groom) ఫిర్యాదు అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను పట్టుకుని వరుడ్ని విడిపించారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున సాధు చౌక్‌లోని పెళ్లి మండపంలో ఒక జంటకు వివాహం జరుగుతున్నది. పెళ్లి వేడుకలో సాంప్రదాయ నృత్యం చేసే ‘లౌండా నాచ్ పార్టీ’కి చెందిన కళాకారులు డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది.
కాగా, అంతా పెళ్లి హడావుడిలో ఉండగా డ్యాన్సర్లు తమపై దాడి చేసి కొట్టారని వధూవరుల కుటుంబాలు వాపోయాయి. పెళ్లికుమారుడితోపాటు పెళ్లికుమార్తెను, మహిళలను కూడా కొట్టారని, నగలతో పాటు విలువైన వస్తువులను దోచుకున్నారని ఆరోపించారు. వరుడ్ని కిడ్నాప్ చేసి వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. డ్యాన్సర్లు కిడ్నాప్ చేసిన వరుడి కోసం విస్తృతంగా వెతికారు. ఏడు గంటల తర్వాత జామో ప్రాంతంలో వారు ఉన్నట్లు గుర్తించారు. డ్యాన్స్ బృందం చెర నుంచి వరుడ్ని విడిపించారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే డబ్బు విషయంపై పెళ్లి కుటుంబాలు, డ్యాన్సర్ల మధ్య ఘర్షణ వల్ల ఈ సంఘటన జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

