పుట్టిన రోజని గుడికి వెళ్తే.. దళితునికి 25 వేలు జరిమానా
జరిమానా | తన నాలుగేండ్ల కొడుకు పుట్టిన రోజున గుడికి తీసుకెళ్లాడో తండ్రి. గుడి బయట నుంచే దేవుడికి దండం పెట్టుకున్నారు. అయినా వారివల్ల ఆలయం అపవిత్రమయిందని గ్రామపెద్దలు ఆ కుటుంబానికి జరిమానా విధించారు.

బెంగళూరు: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతున్నది. అయినా అంటరాని తనం వంటి దురాచారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దళితులపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నది. తన నాలుగేండ్ల కొడుకు పుట్టిన రోజున గుడికి తీసుకెళ్లాడో తండ్రి. గుడి బయట నుంచే దేవుడికి దండం పెట్టుకున్నారు. అయినా వారివల్ల ఆలయం అపవిత్రమయిందని గ్రామపెద్దలు ఆ కుటుంబానికి జరిమానా విధించారు. ఈ నెల 4న కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కొప్పాల్ జిల్లాలోని మియాపుర గ్రామంలో చెన్నదాస కమ్యూనిటీకి చెందిన 30 కుటుంబాలు ఉంటున్నాయి. వారంతా దళిత సామాజిక వర్గానికి చెందినవారు. అందులో ఓ నాలుగేండ్ల బాలుడు ఈ నెల 4న పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భం ఆ బాలుడు తన తండ్రితో కలిసి గ్రామంలో ఉన్న గుడికి వెళ్లాడు. అయితే వారిని ఆలయంలోకి ప్రవేశించకుండా పూజారి అడ్డుకున్నాడు. దీంతో వారు గుడి బయటి నుంచే ఆ భగవంతుడిని మొక్కుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే.. ఈ ఘటనపై సెప్టెంబర్ 11న గ్రామ పెద్దలు సమావేశం నిర్వహించారు. ఆ తండ్రీ కొడుకుల వల్ల ఆలయం అపవిత్రమయిందని.. వారికి రూ.25 వేలు జరిమానా విధించారు. దీంతోపాటు ఆలయ శుద్ధికి ఖర్చుగా మరో రూ.10 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. అంత పెద్దమొత్తం చెల్లించలేమని వేడుకున్నప్పటికీ వారు వినకపోవడంతో విషయాన్ని పోలీసులకు తెలిపారు. అయితే ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి ఒప్పుకోలేదని, దీంతో తాము ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
కాగా, మియాపూరకు వెళ్లిన పోలీసులు గ్రామపెద్దలతో సమావేశం నిర్వహించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగేత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో వారు బాధిత కుటుంబానికి క్షమాపనలు చెప్పారని తహసీల్దార్ సిద్దేశ్ వెల్లడించారు. వచ్చే శనివారం.. గ్రామంలోని అన్ని వర్గాలతో ఆలయ ప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా ఎస్పీ టీ శ్రీధర్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

