Dalai Lama | టిబెట్ సమస్యలపై చైనాతో చర్చించేందుకు సిద్ధం : దలైలామా
Dalai Lama | టిబెట్ సమస్యలపై చైనాతో చర్చించేందుకు సిద్ధమని ప్రముఖ బౌద్ధ మత గురువు దలై లామా అన్నారు. తనను సంప్రదించేందుకు ప్రయత్నించిందని ఆ దేశం ప్రయత్నించిందన్నారు. టిబెట్ ప్రజల ధైర్యాన్ని ఇప్పుడు డ్రాగన్ గుర్తించిందన్న ఆయన.. అందుకే టిబెట్ సమస్యల పరిష్కారానికి చైనా నేతలు తనను సంప్రదిస్తున్నారని చెప్పారు.
Dalai Lama | టిబెట్ సమస్యలపై చైనాతో చర్చించేందుకు సిద్ధమని ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా అన్నారు. తనను సంప్రదించేందుకు ప్రయత్నించిందని ఆ దేశం ప్రయత్నించిందన్నారు. టిబెట్ ప్రజల ధైర్యాన్ని ఇప్పుడు డ్రాగన్ గుర్తించిందన్న ఆయన.. అందుకే టిబెట్ సమస్యల పరిష్కారానికి చైనా నేతలు తనను సంప్రదిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ-లడఖ్‌కు బయలుదేరే ముందు దలై లామా ధర్మశాలలో పాత్రికేయులతో సంభాషించారు. టిబెట్ చాలా ఏళ్లుగా చైనా అధీనంలో ఉంది. మాకు పూర్తి స్వాతంత్ర్యం కావాలి. టిబెట్‌పై చైనా అణచివేత విధానాలను అవలంబిస్తోంది.
అయితే, ఇప్పుడు చైనా తన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటోంది. చైనా ఇప్పుడు మారుతోంది. టిబెట్‌పై అణచివేత వైఖరిని అవలంబిస్తున్న నేతలపైనా నాకు కోపం లేదని దలైలామా అన్నారు. చైనా చారిత్రకంగా బౌద్ధ దేశమని, అక్కడ ఉన్న బౌద్ధ విహారాలు, దేవాలయాలు ఇందుకు నిదర్శనమన్నారు. మఠాలు, దేవాలయాలను కూడా సందర్శించిన వారు నా వద్ద ఉన్నారన్నారు. టిబెట్ సంస్కృతి, మతం గురించిన పరిజ్ఞానం ప్రపంచం మొత్తానికి మేలు చేస్తుందని దలైలామా తెలిపారు. తాను ఇతర మతాలను, వారి సంప్రదాయాలను సైతం గౌరవిస్తానన్న ఆయన.. ప్రేమ, కరుణను వ్యాప్తి చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అనుచరులందరికీ సందేశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

