Cyrus mistry | పాల్ఘర్లో రోడ్డు ప్రమాదం – టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం
Cyrus mistry | టాటా సన్స్ మాజీ చీఫ్ సైరస్ మిస్త్రీ కన్నుమూశారు. పాల్ఘర్లోని చరోతి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. సూర్య నదిపై ఉన్న వంతెనపై...
Cyrus mistry | పాల్ఘర్ : టాటా సన్స్ మాజీ చీఫ్ సైరస్ మిస్త్రీ దుర్మరణం చెందారు. పాల్ఘర్లోని చరోతి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో సూర్య నదిపై ఉన్న వంతెనపై ఉన్న డివైడర్‌ను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం గుజరాత్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ చనిపోయిన విషయాన్ని పాల్ఘర్ పోలీస్ సూపరింటెండెంట్ బాలాసాహెబ్ పాటిల్ ధ్రువీకరించారు.
ఎస్పీ బాలాసాహెబ్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్లే మార్గంలో సూర్య నది వంతెనపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన మెర్సిడెస్ కారు నంబర్ ఎంహెచ్ 47 AB 6705. వంతెనపై ఉన్న డివైడర్‌ను కారు ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం గుజరాత్‌కు తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరి ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు ప్రారంభించారు.
‘ఇది చాలా షాకింగ్ న్యూస్. టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేశాను. అతను మొదటిసారి బాంబే హౌస్‌లోకి ప్రవేశించినప్పుడు నేను అతనికి స్వాగతం పలికాను. ఆ నాలుగేళ్లలో ఆయనతో కలిసి పనిచేయడంలో చాలా ఎంజాయ్ చేశాను. బోర్డ్ మీటింగ్ సందర్భంగా ఆయనతో తరచూ కలుస్తూ ఉండేవాడిని’ అని టాటా సంస్థ మాజీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ యోగేష్ జోషి సైరస్ మిస్త్రీతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.
సైరస్ పల్లోంజీ మిస్త్రీ ఒక వ్యాపార కుటుంబంలో 1968 జూలై 4 న జన్మించారు. ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్ నుంచి ప్రాథమిక విద్యను, లండన్ ఇంపీరియల్ కాలేజ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీఎస్ పట్టా అందుకున్నాడు. అనంతరం లండన్ బిజినెస్ స్కూల్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందాడు. సైరస్ మిస్త్రీ 2012 డిసెంబర్ 28 న టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమితులయ్యారు. టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా వైదొలిగిన తర్వాత 2012 నుంచి 2016 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా కొనసాగాడు. 2016 అక్టోబర్ 24 న చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ తొలగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

