తౌక్టే తుఫాన్.. 140కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

అహ్మదాబాద్: అతి భీకర తుఫాన్ తౌక్టే.. ఇవాళ ఉదయం గుజరాత్లో తీరం దాటింది. సౌరాష్ట్ర ప్రాంతంలోకి తుఫాన్ ప్రవేశించింది. అయితే స్వల్పంగా బలహీనపడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బలమైన గాలులు వీస్తున్నాయి. గాలి వేగం గంటకు 115 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇవాళ ఉదయం వాతావరణశాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. అహ్మదాబాద్‌కు దక్షిణం వైపున 230 కిలోమీటర్ల దూరంలో తౌక్టే తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నది. ఇవాళ సాయంత్రం వరకు మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. కొంకన్ తీరం, గుజరాత్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. చెట్లను, పంటనే నష్టం చేసే బలమైన గాలులు కూడా వీయనున్నాయి. శక్తివంతమైన గాలులకు కొన్ని చోట్ల విద్యుత్తు స్తంభాలు కూలిపడ్డాయి. కొన్ని చోట్ల దాదాపు గంటకు 190 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

