పాస్‌వర్డులతో జాగ్రత్త.. సులభంగా ఉంటే సైబర్ క్రిమినల్స్‌కు చిక్కినట్టే!
ఆన్లైన్ అకౌంట్ పాస్‌వర్డు చాలా క్లిష్టంగా ఎవరూ ఊహించని విధంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగాలు హెచ్చరిస్తుంటాయి. అయితే ఓ తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2025లో ప్రజలు అత్యధికంగా 123456, అడ్మిన్, పాస్వర్డ్, ఇండియా@123 వంటి పాస్‌వర్డులను ఉపయోగించారు.
- 2025లో వాడిన వాటిలో సులువైనవే ఎక్కువ
న్యూఢిల్లీ, నవంబర్ 9: ఆన్లైన్ అకౌంట్ పాస్‌వర్డు (Password) చాలా క్లిష్టంగా ఎవరూ ఊహించని విధంగా ఉండాలని సైబర్ క్రైమ్ (Cyber Crime) విభాగాలు హెచ్చరిస్తుంటాయి. అయితే ఓ తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2025లో ప్రజలు అత్యధికంగా 123456, అడ్మిన్, పాస్వర్డ్, ఇండియా@123 వంటి పాస్‌వర్డులను ఉపయోగించారు. దాదాపు 200 కోట్ల ఖాతాలకు చెందిన పాస్వర్డులు సులభంగా హ్యాకింగ్‌కు గురయ్యే రీతిలో ఉన్నట్లు కంపేరిటెక్ పరిశోధకులు వెల్లడించారు.
సర్వ సాధారణంగా అత్యధికులు ఉపయోగించే పాస్వర్డులలో అడ్మిన్, ఎఎ123456, 123, 12345 67890, పాస్‌వర్డు ఉన్నాయి. 123 456 పాస్వర్డును 76 లక్షల మందికిపైగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. కాగా, అడ్మిన్ అనే పాస్వర్డును 19 లక్షల మందికిపైగా వినియోగిస్తున్నారు. అత్య ంత సర్వసాధారణమైన 100 పాస్‌వర్డుల జాబితాలో ఇండియా@123కి 53వ స్థానం దక్కింది.
అత్యధికంగా వాడిన పాస్వర్డులివే
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అత్యధికంగా ఉపయోగిస్తున్న పాస్వర్డులలో 123456, 12345678, అడ్మిన్, 1234, ఎఎ123456, 12345, పాస్‌వర్డు, 123, 1234567890 ఉన్నాయి.
ఎలాంటి పాస్వర్డ్డ్ ఉండాలి?
ఆన్లైన్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సూచిస్తున్నాయి. పాస్వర్డుకు కచ్చితంగా 12 అక్షరాలు ఉండాలి. ఇందులోని అక్షరాలు క్యాపిటల్, స్మాల్ లెటర్స్ కలగలిపి ఉండాలి. మధ్యలో సంఖ్యలు, చిహ్నాలు కూడా ఉండాలి. కుటుంబ సభ్యుడి పేరు, సొంత కంపెనీ వస్తువు, పోషించిన పాత్రల పేర్లు వంటివి పాస్‌వర్డులో ఉండకూడదు. ఫ్రాన్స్‌లోని లూవ్రా మ్యూజియంలో చోరీ కూడా సులువైన పాస్వర్డ్ కారణంగానే జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

