Rahul Gandhi | ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నిక కోసం.. సీడబ్ల్యూసీ తీర్మానం
Rahul Gandhi | లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి రాహుల్ గాంధీ అంగీకరించవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారన్నారు.
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని (Rahul Gandhi) ఎన్నుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి రాహుల్ గాంధీ అంగీకరించవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారన్నారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) విస్తృత సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.
కాగా, సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కావాలని కాంగ్రెస్ నేతలంతా గట్టిగా కోరుతున్నారని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇది వర్కింగ్ కమిటీ అభ్యర్థన అని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్‌ల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చేసిన కృషిని కూడా సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడిందని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

