Customs Seizes Gold, Electronics | విమానాశ్రయంలో కస్టమ్స్ స్పెషల్ డ్రైవ్.. రూ.6.75 కోట్ల విలువైన బంగారం, ఎలక్ట్రానిక్స్ స్వాధీనం
Customs Seizes Gold, Electronics | విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రూ.6.75 కోట్ల విలువైన బంగారం, ఎలక్ట్రానిక్స్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.88 లక్షల విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నారు.
ముంబై: విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రూ.6.75 కోట్ల విలువైన బంగారం, ఎలక్ట్రానిక్స్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. (Customs Seizes Gold, Electronics) అలాగే రూ.88 లక్షల విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మే 27 నుంచి మే 30 వరకు నాలుగు రోజులపాటు స్పెషల్ డ్రైవ్‌ను కస్టమ్స్ అధికారులు నిర్వహించారు. స్మగ్లింగ్‌కు సంబంధించి 20 కేసులు నమోదు చేశారు. పలువురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
కాగా, షార్జా, మస్కట్ నుంచి ముంబైకి విమానంలో ప్రయాణించిన ఇద్దరు విదేశీయులు బంగారం పౌడర్ కలిగి ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రార్థన చేసే చాపల్లోని రబ్బరు షీట్ల మధ్య దాచిన గోల్డ్ డస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు బ్యాంకాక్ వెళ్తున్న భారతీయుడు రెండు షాంపూ బాటిళ్లలో దాచిన రూ. 88.6 లక్షల విలువైన విదేశీ కరెన్సీతో ముంబై విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. అలాగే దుబాయ్ నుంచి ప్రయాణించిన భారత పౌరుడు శానిటరీ ప్యాడ్‌లో దాచిన బంగారం పౌడర్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
కాగా, కొలంబో, దుబాయ్ నుంచి ముంబైకి ప్రయాణించిన ఐదుగురు విదేశీయులు తమ లోదుస్తుల్లో దాచిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుబాయ్, మస్కట్, జెడ్డా నుంచి ప్రయాణించిన 11 మంది భారతీయులు దాచిన బంగారం, మొబైల్ ఫోన్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

