IED Blast | ఒడిశాలో పేలిన ఐఈడీ.. సీఆర్పీఎఫ్ అధికారి మృతి
IED Blast | ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో శనివారం ఉదయం ఘోరం జరిగింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు.
IED Blast | భువనేశ్వర్ : ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో శనివారం ఉదయం ఘోరం జరిగింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు.
అప్రమత్తమైన ఒడిశా పోలీసులు.. ఐఈడీ పేలిన పరిసర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మృతి చెందిన సీఆర్పీఎఫ్ ఆఫీసర్‌ను ఏఎస్ఐ సత్యబాన్ కుమార్ సింగ్(34)గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన కుమార్ సింగ్‌ను రూర్కేలాలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కుమార్ సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ జిల్లా.
రూర్కేలాలోని కే బాలంగ్ గ్రామ సమీపంలోని అడవుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసులు కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది. ఈ ఘటన శనివారం ఉదయం 6 గంటలకు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

