CRPF: సిబ్బంది సూసైడ్లను నివారించేందుకు సీఆర్పీఎఫ్ కోర్ గ్రూపు ఏర్పాటు
CRPF: సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్‌లో గత ఏడాది 59 మంది సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యలను నివారించేందుకు 10 మంది సీనియర్లతో కోర్ గ్రూపును సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేసింది. సూసైడ్ కేసులను స్టడీ చేసి, మళ్లీ ఆ సంఘటనలు జరగకుండా సీఆర్పీఎఫ్ చర్యలు చేపట్టనున్నది.
న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(CRPF)లో గత ఏడాది ఆత్మహత్యలు పెరిగాయి. 2025లో సుమారు 59 మంది సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆ ఆత్మహత్యల పరంపరను అడ్డుకునేందుకు సీఆర్పీఎఫ్ సిద్దమైంది. పది మంది సభ్యులతో కోర్ గ్రూపును ఏర్పాటు చేసింది. ఆ గ్రూపులో సీనియర్ల ఆఫీసర్లు ఉన్నారు. గడిచిన అయిదేళ్లలో అత్యధికంగా 2025లో 59 మంది సిబ్బంది సూసైడ్ చేసుకున్నారు. కోర్ గ్రూపునకు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ నేతృత్వం వహించనున్నారు. ప్రతి నెలకు ఒకసారి డీజీ నేతృత్వంలో సమీక్ష జరగనున్నది. సూసైడ్ ఘటనల గురించి సమీక్షించనున్నారు.
సీఆర్పీఎఫ్లో మొత్తం 3.25 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. సూసైడ్ చేసుకున్నవారిలో 80 శాతం మంది కానిస్టేబుళ్లే ఉన్నారు. 77 కేసుల్లో.. విధుల్లో ఉన్నపుడే సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి వ్యక్తి కేసును కోర్ గ్రూపు క్షుణ్ణంగా పరిశీలించనున్నది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా సంక్షేమ, వైద్య, అడ్మినిస్ట్రేటివ్ చర్యలు చేపట్టనున్నారు. సూసైడ్ కేసుల్లో జరుగుతున్న పరిణామాలను గుర్తించి, రిస్క్ ఫ్యాక్టర్లను పరిశీలించి, దానికి తగిన రీతిలో వ్యవస్థీకృత పరిష్కారాన్ని కోర్ గ్రూపు చూపనున్నది.
రిపోర్టింగ్ హెడ్స్, సూపర్వైజరీ ఆఫీసర్లు కేసు విశ్లేషణ సమయంలో సహకరించనున్నారు. సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నట్లు సీఆర్పీఎఫ్ పేర్కొన్నది. సీఆర్పీఎఫ్ సూసైడ్లపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు స్వీకరించింది. కేంద్ర హోంశాఖ, సీఆర్పీఎఫ్ డీజీ నుంచి రెండు వారాల్లోగా వివరణ కావాలని కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

