Viral News | కరోనా భయంతో మూడేండ్లుగా స్వీయనిర్బంధం.. ఆఫీసుకు వెళ్తున్నాడని భర్తను కూడా ఇంట్లోకి రానివ్వని మహిళ
Viral News | కరోనా భయంతో ఓ మహిళ తన 10 ఏండ్ల కొడుకుతో కలిసి దాదాపు మూడేండ్లు ఇంట్లోనే ఉన్నది. భర్తను కూడా ఇంట్లోకి రానివ్వకుండా లోపలి నుంచి తాళం వేసుకున్నది. ఈ విచిత్ర ఘటన గురుగ్రామ్‌లో వెలుగుచూసింది.
Viral News | గురుగ్రామ్: కరోనా భయంతో ఓ మహిళ తన 10 ఏండ్ల కొడుకుతో కలిసి దాదాపు మూడేండ్లు ఇంట్లోనే ఉన్నది. భర్తను కూడా ఇంట్లోకి రానివ్వకుండా లోపలి నుంచి తాళం వేసుకున్నది. ఈ విచిత్ర ఘటన గురుగ్రామ్‌లో వెలుగుచూసింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సుజన్.. భార్య, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. అయితే 2020లో తొలిసారిగా లాక్డౌన్ నిబంధనలను సడలించగానే సుజన్ ఉద్యోగానికి వెళ్లాడు. కానీ ఆనాటి నుంచి సుజన్ భార్య మున్మున్ స్వీయ నిర్భందాన్ని విధించుకున్నది.
తలుపు తీయాలని సుజన్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో సుజన్ సమీపంలోనే మరో ఇంట్లో ఉంటున్నాడు. రోజూ నిత్యావసరాలను తీసుకొచ్చి తలుపు వద్ద ఉంచేవాడు. ఆయన వెళ్లాక ఆమె వాటిని తీసుకునేది. భార్యాభర్తలు వీడియోకాల్‌లో మాట్లాడుకునేవాళ్లు. ఇలా దాదాపు మూడేండ్లు గడిచినా సుజన్ భార్య మనసు మారలేదు. దీంతో ఆయన పోలీసులను సంప్రదించాడు. పోలీసులు డోర్‌ను పగులకొట్టి మున్మున్ని, ఆమె కుమారుడిని దవాఖానకు తరలించారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

