లాంగ్ కోవిడ్.. 6 నెలల తర్వాత మళ్లీ రీ ఇన్ఫెక్షన్

న్యూఢిల్లీ: కోవిడ్ సోకిన వారిలో మళ్లీ కోవిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరు నెలల నుంచి 12 నెలల మధ్య కాలంలో రీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సు ఉన్నట్లు జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ ఎన్కే అరోరా వార్నింగ్ ఇచ్చారు. కోవిడ్19 కొత్త వ్యాధి అని, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లకు లేని లక్షణాలు ఈ వ్యాధిలో ఉన్నాయని, కోవిడ్ గురించి ఇంకా అధ్యయనం చేస్తున్నామని, అయితే గతంలో వైరస్ సోకి కోలుకున్నవారిలో మళ్లీ ఆరు నెలల నుంచి ఏడాది లోగా కొత్త లక్షణాలు డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు అరోరా తెలిపారు. దీనికి లాంగ్ కోవిడ్ అని కొత్త పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఒకసారి కోవిడ్ సోకితే.. ఆ తర్వాత యాంటీబాడీలు మూడు నుంచి తొమ్మిది నెలల వరకు ఉంటాయని, దాంతో రీ ఇన్ఫెక్షన్లు అడ్డుకోవచ్చు అని కూడా ఆయన చెప్పారు.
భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా రీ ఇన్ఫెక్షన్లు అరుదని గ్రహించినట్లు ఆరోరా తెలిపారు. కొన్ని సందర్భాల్లో రికవరీ అయిన మూడు నెలల తర్వాత మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. కొందరిలో కోవిడ్ వల్ల దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయన్నారు. అలసట, శ్వాస కోశ సమస్యలు, నరాల సంబంధిత ఇబ్బందులు ఉంటాయన్నారు. లాంగ్ కోవిడ్ వల్ల తీవ్రమైన నీరసం ఉంటుందని, పది మందిలో ఒకరు ఇలాంటి లక్షణాలతో కనీసం మూడు వారాల పాటు బాధపడుతారని నిపుణులు చెప్పారు. B.1.617 వైరస్ అత్యంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోందని, ఈ వేరియంట్ సోకినవారు కోలుకునేందుకు నాలుగు నుంచి అయిదు నెలల పడుతుందని మణిపాల్ హాస్పిటల్ డాక్టర్ సుశాంత్ ఛాబ్రా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

