నవ్విస్తూనే ఆలోచింపజేసే ‘ఇడుపు కాయితం’
‘నేను తెలంగాణలోనే పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడి సంప్రదాయాలు, ఆచారాలు, పెళ్లితంతు గురించి మంచి అవగాహన ఉంది.
‘నేను తెలంగాణలోనే పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడి సంప్రదాయాలు, ఆచారాలు, పెళ్లితంతు గురించి మంచి అవగాహన ఉంది. ఈ సినిమాలో చూస్తుంటే అవన్నీ గుర్తుకొచ్చాయి. ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అయ్యే అందమైన కుటుంబ కథ ఇది’ అన్నారు అగ్ర దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత సుకుమార్. ఆమె బన్నీ వాసుతో కలిసి నిర్మించిన ‘ఇడుపు కాయితం’ డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది.
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ..ఈ సినిమాలోని మాటలు మన ఇంట్లో మాట్లాడుకుంటున్నట్లుగానే ఉంటాయని, ఎక్కడ నాటకీయత ఉండదని, ఆద్యంతం నవ్విస్తూనే ఆలోచింపజేసే కథాంశమిదని పేర్కొన్నారు. మనందరి ఇళ్లలో జరిగే కథ ఇదని, ప్రతి సన్నివేశం, మాట సహజంగా ఉంటుందని హీరో ప్రియదర్శి అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ “ఇడుపుకాయితం’ అనేది ఓ జంట విడిపోవడానికి రాసుకునే పత్రం అనుకుంటాం. కానీ అదే జంట విడిపోయిన తర్వాత కొత్త జీవితం ప్రారంభించడానికి ఒక సర్టిఫికెట్లాగ ఇడుపుకాయితాన్ని భావించాలన్నది నా ఉద్దేశ్యం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాణ సంస్థలు: సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్, రచన-దర్శకత్వం: వంశీరెడ్డి దొండపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

