COVID-19 | కరోనా వైరస్ 223 సార్లు పరివర్తన చెందింది: కేంద్ర ఆరోగ్య మంత్రి
COVID-19 | కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 223 సార్లు పరివర్తన చెందిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇన్ఫ్లుఎంజా మాదిరిగా కరోనా (COVID-19) కొనసాగుతుందని, దాని వేరియంట్స్ ఇప్పుడు ప్రాణాంతకం కాదని అన్నారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 223 సార్లు పరివర్తన చెందిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇన్ఫ్లుఎంజా మాదిరిగా కరోనా (COVID-19) కొనసాగుతుందని, దాని వేరియంట్స్ ఇప్పుడు ప్రాణాంతకం కాదని అన్నారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కరోనా గురించి మన్సుఖ్ మాండవియా మాట్లాడారు. ‘ఒక వైరస్ వంద సార్లు మ్యుటేషన్ చెందినప్పుడు దాని హానికరమైన ప్రభావాలు తగ్గుతాయి. కోవిడ్ కూడా పరివర్తన చెందింది. ఇప్పటివరకు కరోనా వైరస్ 223 సార్లు పరివర్తన చెందింది’ అని తెలిపారు. ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు ప్రజలకు వచ్చే ఇన్ఫ్లుఎంజా మాదిరిగా కరోనా మనతో ఉంటుందని, ఆ వైరస్ అలాగే కొనసాగుతుందని చెప్పారు. కరోనా సబ్ వేరియంట్స్ అంత ప్రాణాంతకం కాదని, వాటి వల్ల ప్రతికూల ప్రభావాలు లేవని అన్నారు.
కాగా, ఆరోగ్య సమస్యపై అన్ని దేశాలు, అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయడంతో సానుకూల ఫలితాలను చూశామన్నారు. భారత్‌లో పటిష్టమైన ఔషధ ఉత్పత్తి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ప్రపంచం దానిని గుర్తించిందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 70 శాతం హెచ్ఐవీ/ఎయిడ్స్ మందులను ఉత్పత్తి చేస్తున్నామని, అలాగే ప్రపంచం మంచిదని భావించే అనేక మెడిసిన్స్‌ను భారత్ ఉత్పత్తి చేస్తోందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి ఆయన వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

