Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
Saurav Das : సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ల జుడీషియల్ కస్టడీ పొడిగించాలంటూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదేశాలను కోర్టు రిజర్వ్ చేసింది.
Saurav Das : సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ల జుడీషియల్ కస్టడీ పొడిగించాలంటూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదేశాలను కోర్టు రిజర్వ్ చేసింది. రాంకా, సౌరవ్.. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అదుపులో.. తిహార్ జైలులో ఉన్నారు. వీరిని అక్టోబర్ 13న అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు ఐదు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఆ తర్వాత పోలీసులు కస్టడీ పొడిగింపు కోరుతూ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అనుమతించింది.
ఇప్పుడు మరోసారి కస్టడీ కోరుతూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇంకో మూడు రోజులు కస్టడీ పొడిగించాలని కోరారు. అయితే, ఈ కస్టడీని వ్యతిరేకిస్తూ ఇంతకుముందు రాంకా, సౌరవ్ దాస్‌లు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం ఆ పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నారు. ఇక, ఢిల్లీ పోలీసుల పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. తమ ఆదేశాల్ని రిజర్వ్ చేసింది. ఢిల్లీ హైకోర్టులో దాస్, రాంకాల పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ ప్రకారం సౌరవ్ దాస్ వయసు 27 కాగా, రాంకా వయసు 31గా తేలింది. అంటే, జెన్ జీ ఉద్యమం చేస్తున్న వీరు అసలు జెన్ జీయే కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
సౌరవ్ దాస్, రాంకాల అరెస్టుపై కాంగ్రెస్ స్పందించింది. జాతీయ జెండాను చేతబట్టుకుని ర్యాలీలు చేయడం తప్పెలా అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరోవైపు అనేక రాష్ట్రాల్లో బీజేపీ నేతలు జాతీయ జెండాలతోనే ర్యాలీలు చేస్తున్నారని కాంగ్రెస్ గుర్తు చేసింది. సీఈసీకి వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన నిరసన సందర్బంగా నిబంధనలు ఉల్లంఘించారు అనే కారణంతో ఢిల్లీ పోలీసులు రాంకా, సౌరవ్ దాస్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరు ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

