న్యూఢిల్లీ : బాలీవుడ్ మూవీస్‌లో రెయిన్‌తో రొమాన్స్ పోటీపడుతుంటుంది. వర్షపు జల్లుల్లో జంట శృంగార పారవశ్యంలో తేలిపోయే పాటలు ఎప్పటికీ ట్రెండింగ్‌లో నిలుస్తుంటాయి. ఇక ఉత్తరాదిలో భారీ వర్షాలు వణికిస్తుంటే ఓ జంట షాహిద్ కపూర్, కరీనాలు స్క్రీన్ పంచుకున్న జబ్ వి మెట్ మూవీలోని తుమ్ సే హి సాంగ్‌ను (Viral Video) రీక్రియేట్ చేసింది.
This Or Nothing 😭😭❤️
Najar na lge 🧿 pic.twitter.com/OkG6S5dEjG— Anu. (@theLostFirsbee) July 7, 2023
బాలీవుడ్లో ప్రముఖ రొమాంటిక్ ట్రాక్స్‌లో ఒకటైన ఈ పాటకు వానలో ఈ జంట తమ క్రేజీ మూమెంట్స్‌తో వేడి పుట్టించారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ అను నెట్టింట షేర్ చేశారు.
ఈ వైరల్ క్లిప్‌లో జంట తమ వెనుక వాహనాలు వెళుతుండగా పేవ్‌మెంట్‌పై డ్యాన్స్‌తో హోరెత్తించారు. జంట అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిందని పలువురు యూజర్లు వీరిపై ప్రశంసలు గుప్పించారు.
Read More :
RC16 Movie | రామ్‌చరణ్ సినిమాలో పవర్ఫుల్ విలన్‌గా కోలీవుడ్ స్టార్?