Ram Charan | మెగా ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చినా తన నటన, అభినయంతో ప్రత్యేక అభిమానగళాన్ని సంపాదించుకున్నాడు రామచరణ్. గతేడాది రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’తో తిరుగులేని క్రేజ్‌ను, మార్కెట్‌ను ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఆయన శంకర్‌తో ‘గేమ్‌చేంజర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్ ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. దర్శకుడు శంకర్ ఇండియన్-2ను పూర్తి చేయాల్సిన పని పడటంతో ఈ సినిమా అనుకున్నంత వేగంగా ముందుకు సాగట్లేదు. ప్రస్తుతం ఇండియన్-2 షూటింగ్ చివరిదశలో ఉంది. అది పూర్తయిన తర్వాతే ఈ సినిమా ఊపందుకోనుంది.
ఈ గ్యాప్‌లో రామ్‌చరణ్.. బుచ్చిబాబుతో చేయబోయే సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఏఆర్. రెహమాన్‌ను రంగంలో దింపగా.. మరో పెద్ద స్టార్‌ను సినిమాలో భాగం చేయబోతున్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక బుచ్చిబాబు డెబ్యూ సినిమా ఉప్పెనలో రాయణంగా అలరించిన విజయ్ సేతుపతి ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతుంది.