‘మారి 2’ సినిమాలోని ‘రౌడీ బేబీ’ పాట ఎంత హిట్లయిందో చెప్పనక్కర్లేదు. పెప్పీ లిరిక్స్తోపాటు ధనుష్, సాయిపల్లవి డ్యాన్స్ అందరినీ కట్టిపడేసింది. ఈ పాటపై చాలామంది రీల్స్ చేశారు. కానీ, కోల్కతాకు చెందిన ఓ జంట చేసిన డ్యాన్స్ మాత్రం నెటిజన్లను కట్టిపడేసింది. ‘వావ్.. ఏమి డ్యాన్స్’ అంటూ ఆ జంటపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కోల్కతాకు చెందిన సౌరభ్, అనూష అనే కొరియోగ్రాఫర్ జంట.. ధనుష్, సాయిపల్లవిలాగా కాస్ట్యూమ్స్ వేసుకొని ‘రౌడీ బేబీ’ పాటపై అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ వీడియోను ‘జోడియానూరబ్’ అనే పేజీ ద్వారా ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. ఇప్పటివరకూ ఈ వీడియోను 2.31 లక్షల మంది లైక్ చేయడం విశేషం. చాలామంది కామెంట్ సెక్షన్లో లవ్ ఎమోజీలు ఉంచారు.