శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 09, 2020 , 12:34:09

మూడేళ్ల బాలుడికి కరోనా వైరస్‌..

మూడేళ్ల బాలుడికి కరోనా వైరస్‌..

కేరళ: కేరళలో మూడేళ్ల బాలుడికి కరోనా వైరస్‌(కొవిద్‌-19) సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. రాష్ట్రంలోని ఎర్నాకుళం వైద్య కళాశాలలో వైద్యులు బాలుడిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. బాలుడి కుటుంబం ఇటీవలే ఇటలీలో పర్యటించింది. చిన్నారి బాలుడు జలుబుతో బాధపడుతుండడంతో.. అతని తల్లిదండ్రులు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షలు నిర్వహించడంతో.. కరోనా పాజిటవ్‌గా తేలింది. ఇటలీ పర్యటనలోనే చిన్నారికి కరోనా సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. కాగా, నిన్న కేరళలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు కరోనా సోకినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె. శైలజ వెల్లడించారు. 

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 42కి చేరింది. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా ఢిల్లీలోని ప్రైమరీ పాఠశాలలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇతర రాష్ర్టాల్లో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు. 


logo