వచ్చే నెలలోనే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం: ఎస్బీఐ రిపోర్ట్

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య నాలుగు నెలల కనిష్ఠానికి దిగి వచ్చింది. అయితే అప్పుడే మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని చెబుతోంది ఎస్బీఐ తాజా సర్వే. ఆగస్ట్‌లోనే ఈ మూడో వేవ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తన తాజా నివేదికలో హెచ్చరించింది. కొవిడ్-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో ఎస్బీఐ తన పరిశోధన నివేదికను రూపొందించింది. ఇక కొవిడ్ థర్డ్ వేవ్ పీక్ సెప్టెంబర్‌లో ఉంటుందనీ ఈ అధ్యయనం అంచనా వేసింది.
ఇండియాలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన నమోదైందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం డేటా ప్రకారం చూసుకుంటే ఇండియాలో జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు నమోదు కావచ్చు. అయితే ఆగస్ట్ రెండో పక్షంలో కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరగొచ్చని ఎస్బీఐ రిపోర్ట్ అంచనా వేసింది.
రిపోర్ట్‌లోని ముఖ్యాంశాలు
- కరోనా థర్డ్ వేవ్ సగటు పీక్ స్టేజీ కేసులు రెండో వేవ్ పీక్ స్టేజీలో నమోదైన కేసుల కంటే 1.7 రెట్లు ఎక్కువగా ఉండనున్నట్లు గ్లోబల్ డేటా చెబుతోంది.
- ఆగస్ట్ రెండో పక్షంలో కేసుల సంఖ్య క్రమంగా పెరగడం ప్రారంభమై.. నెలలోపు పీక్ స్టేజీకి వెళ్లే చాన్స్ ఉంది.
- ఇక వ్యాక్సినేషన్ల విషయానికి వస్తే.. దేశంలో సగటున రోజుకు 40 లక్షల వ్యాక్సిన్లు ఇస్తున్నారు.
- దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 4.6 శాతం కాగా.. 20.8 శాతం మంది తొలి డోసు వేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. పోలీసుల దాడుల్లో విద్యార్థి నేతలు గాయపడ్డారని ఆరోపణ
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

