Corona: థర్డ్ వేవ్ తప్పదు.. సిద్ధంగా ఉండండి: ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌తోనే ఇప్పుడు దేశం అతలాకుతలమవుతోంది. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. కరోనా థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరించింది. దానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అయిన కే విజయరాఘవన్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. వైరస్ కొత్త వేరియంట్లు చాలా వేగంగా సంక్రిమిస్తాయని ఆయన తేల్చి చెప్పారు. కొవిడ్ పరిస్థితి, రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు.
కరోనా వైరస్ కొత్త వేరియంట్లపై ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు పని చేస్తున్నారని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ వేరియంట్లను ముందుగానే గుర్తించి వాటిని సమర్థంగా ఎదుర్కొనే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పింది. ఈ పని ఇండియాలోనూ జరుగుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం వేరియంట్లపై వ్యాక్సిన్లు సమర్థంగా పని చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రోగ నిరోధక వ్యవస్థను బోల్తా కొట్టించేవి, వ్యాధి తీవ్రతను పెంచే లేదా తగ్గించే వేరియంట్లు రాబోతున్నాయని చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

