తుఫాన్‌లా వచ్చి పడింది!

- వైరస్ కట్టడికి వ్యాక్సినేషనే మార్గం
- అందరూ టీకాలు వేయించుకోవాలి
- 45 ఏండ్లు పైబడినవారికి ఉచితంగా టీకాలు
- రాష్ర్టాలకు కావాల్సిన సాయం
- ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: తొలిదశ కరోనా విజృంభణను సమర్థంగా ఎదుర్కొన్న భారత్.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న సమయంలో రెండోదశ తుఫాన్‌లా వచ్చిపడిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కరోనా సెకండ్ వేవ్ దేశ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నదని పేర్కొన్నారు. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలంటే నిపుణులు అందిస్తున్న సలహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ర్టాలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతినెలా చివరి ఆదివారం జరిగే ‘మన్ కీ బాత్’లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముప్పై నిమిషాలపాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో ఆయన మాట్లాడారు. కరోనా సంక్షోభం నుంచి ప్రజలందరూ త్వరలోనే బయటపడుతారని ధీమా వ్యక్తం చేశారు. మహమ్మారిని ఓడించడమే దేశప్రజల ముందున్న సవాల్ అని అన్నారు. వ్యాక్సిన్లపై అపోహలను నమ్మవద్దని, అందరూ టీకాలు వేయించుకోవాలన్నారు. 45 ఏండ్లు పైబడిన అందరికీ టీకాలను ఉచితంగా అందజేస్తామన్నారు. ఎంత ఎక్కువ మంది వైరస్‌బారిన పడుతున్నారో, అదే స్థాయిలో కోలుకుంటున్నారని గుర్తు చేశారు. మహమ్మారిని తరిమి కొట్టడానికి ‘దవాయి భీ.. కడాయి భీ’ (ఔషధమూ తీసుకోవాలి.. జాగ్రత్తలూ పాటించాలి’) అన్న నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- corona
- Covid19
- Man ki Baat
- Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

