బూస్టర్ డోస్‌గా బయోలాజికల్-ఈ కార్బెవాక్ టీకా..! కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ : హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ కంపెనీ తయారు చేసిన కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా వేసేందుకు కేంద్రం ఆమోందం తెలిపింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి టీకా అందుబాటులోకి రానున్నది. గతంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తులు కార్బెవాక్స్ టీకాను బూస్టర్ డోస్‌గా ఇవ్వొచ్చని ప్రభుత్వ వర్గాలు బుధవారం తెలిపాయి. ప్రైమరీ వ్యాక్సినేషన్లో ఇచ్చిన డోస్‌తో పాటు బూస్టర్ డోస్‌గా వ్యాక్సిన్‌ను ఆమోదించడం ఇదే తొలిసారి. ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTIAGI)కి చెందిన కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఇటీవల చేసిన సిఫారసుల మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది.
18 సంవత్సరాలు పైబడిన వారు కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండో డోస్ తీసుకున్న తేదీ నుంచి ఆరు నెలల తర్వాత ప్రికాషనరీ డోస్‌గా కార్బెవాక్స్ టీకాను తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కార్బెవాక్స్ మోతాదు కోసం కొవిన్ పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బయోలాజికల్-ఈ తయారు చేసిన కార్బెవాక్స్ టీకా దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి ఆర్బీడీ వ్యాక్సిన్. ప్రస్తుతం జాతీయ కొవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా 12-14 సంవత్సరాల పిల్లలకు వినియోగిస్తున్నారు. గత జూన్ 4న డీసీజీఐ 18 సంవత్సరాలు పైబడిన వారికి కార్బెవాక్స్ టీకాను ప్రికాషనరీ డోస్‌గా వేసేందుకు ఆమోదముద్ర వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

