News Papers | న్యూఢిల్లీ: న్యూస్ పేపర్లలో ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయడం, భద్రపరచడం ఆరోగ్యానికి మంచిది కాదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆహార పదార్థాలు ప్యాకింగ్, భద్రపరిచేందుకు న్యూస్పేపర్లను వాడొద్దని వినియోగదారులు, వర్తకులను కోరింది.
న్యూస్పేపర్లలో ఉండే ప్రింటింగ్ ఇంక్‌లో హానికరమైన రసాయనాలు ఉంటాయని, వాటి వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపింది.